పుట:Geetanjali (Telugu).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

77

గీతాంజలి.

నీవు చనుదెంచుచోట నే ♦ నిలువ లేదు.
భ్రాతలందెల్ల భ్రాత వై ♦ వరలు దీవు;
కాని వారల నెవరెల ♦ క్ష్యంబుసేయ;
నొమహాప్రభు ! నీతోడ ♦ నున్నదెల్ల
బంచికొనినట్లు గాగ నే ♦ వారితోడ
బంచుకొనలేదు కొర్చిన ♦ భాగ్యములను.
అధిప ! నీకడనిల్చిన ♦ యట్లు గాగ
జనులసుఖదు:ఖములయందు ♦ సరస జేరి
నిలువలేదు నిజంబుగ ♦ నిలువ లేదు.
ఒసగ బ్రాణంబు వెనుదీయు ♦ చున్నవాడ;
గాన జీవనజలధి మ ♦ గ్నంబు గాక
యున్నవాడను దీనుడై ♦ యున్నవాడ.

78


సృష్టియంతయు గ్రొత్తగ ♦ జెలగునాడు
చుక్కలెల్లను నెంతయు ♦ శుభ్రమైన
తొలివెలుగుచేత దళతళ ♦ వెలుగుచుండ
నింగి నభదీఱి దేవతల్ ♦ నెమ్మి బాడి
"గహహ ! పూర్ణస్వరూపమా! యమలమైన
యద్భుతానందరూపమా" ♦ యంచు మించి
"కాంతిపక్త్కిని నొకవెల్తి ♦ కాన వచ్చె;