పుట:Geetanjali (Telugu).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
78

గీతాంజలి.

జకట ! యొకచుక్క జాఱిన ♦ యట్లు దోచె"
నంచు నెల్గెత్తి వారిలో ♦ నఱచె నొకడు.
"వీణబలంగరుతీగియ ♦ వీది పడియ;
రాగతాళంబు లన్నియు ♦ నాగిపోయె.
ఓహో ! జాఱినచుక్కన ♦ ర్వోత్తమంబు
గగనమునకెల్ల మణియయి ♦క్రాలు చుండె"
నంచునాశ్చర్యమున నంద ♦ ఱఱచి రపుడు.
నాటినుండియు వారెల్ల ♦ చోటులందు
వెదకుచుందురు దానికై ♦ విడువకుండ.
"జగమునకు దానితో నొక్క ♦ నగయె తొలగె"
ననెడుమాటయె వారిలో ♦ నల్లుకొనియె;
గాని నిశ్శబ్దనిశి దమ ♦ లోన దామె
గుసగుస్దలువోయె జుక్కలు ♦ కూడి నగుచు
వెదకుటెల్లను దానికై ♦ వృధయవృదయ
దేనిలో నది సంపూర్ణ ♦ మైన దంచు

79


దేవ ! నిన్గాంచుభాగ్యమీ ♦ జీవితమున
నేను గనజాల నేని యో ♦ దీనరక్ష !
"తప్పితిని నీదుదృష్టికి ♦ దప్పితి" నని
యెప్పుడును నాదుమదిలోన ♦ నెంచ నిమ్ము.