పుట:Geetanjali (Telugu).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

69

గీతాంజలి.

దాల్చుచుందువు మేఘన ♦ స్త్రంబు దేవ !
తేలికయు మెత్తదనము న ♦ స్థిరతబాష్ప
జలములును నల్లదనమును ♦ జాల నుంట
దాని బ్రేమిందుతు గదా యు ♦ దారచరిత!
కాన నీకేవలశ్వేత ♦ కాంతిమీద
జాలిమై గప్పు దత్తమో ♦ చ్చాయ లెపుడు.

69


నాదునాడులయందు న ♦ నారతంబు
బాఱు జీవనపూర మే ♦ పాఱుచుండు
సకలజగములయందును ♦ సంతతంబు
నొక్కతీరున లయ దప్ప ♦ కుండునట్లు.
అదియె పొదలుచు దలయెత్తు ♦ నవనినుండి
పొలుచుపలు తెఱుగులగడ్డి ♦ పోచ లగుచు;
నదియె యుప్పొంగు బుష్పప ♦ త్రాళియగుచు;
నదియె వృద్ధిక్షయంబుల ♦ నంది చెలగు
లొలసంసారసాగర ♦ డోలయందు
నూపబడుచుండు నెప్పుడు ♦ నూపబడును.
ద్చేతనాత్మక మైనవి ♦ ఖ్యాతజగతి
యంటుమాత్రన వాయువ ♦ యపములెల్ల