పుట:Geetanjali (Telugu).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
66

గీతాంజలి.

నీదుదృష్టిని గనుటయు ♦ నాదు చెవుల
నాకిళుల నిల్చి నీనిత్య ♦ పరమశాంతి
వినుటయును నీకు వేడ్కలై ♦ వెలసియున్నె ?
నీజగము నామనంబున ♦ నేర్పుతోడ
నల్లుచున్నవి పదముల ♦ నందముగను;
నీప్రమొదమ్ము వానికి ♦ నింపు నింపు;
నెన్నగాగానిప్రేమతో ♦ నిన్ను నీవె
నాకు నొసగుచునాయందె ♦ నాధ నీవు
పొందుచుందువు నీపరి ♦ పూర్ణసుఖము.

66


సంజ మిణుకుమిణు క్కను ♦ సమయమునను
మద్గభీరతలమ్మును ♦ మాననట్టి
వేకువనుగూడ ముసుగును ♦ వీడనట్టి
దానినుంచి మదీయాంత ♦ గానమందు
నెలమి దుదికాన్కగా నీకు ♦ నిడెద దేవ!
పలుకులు పఠించి మెప్పును ♦ బడయ దయ్యె;
హస్తములు చాచె బోధన ♦ వ్యర్ధముగను
బదిలముగ బెట్టి దీని నా ♦ హృదయమందు
దేశదేశమ్ము లెల్లను ♦ దిరిగినాను;
దీన గడచెను నాదువృ ♦ ద్ధిక్షయములు;