పుట:Geetanjali (Telugu).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

65

గీతాంజలి.

వృధగ నాకన్నె దీపంబు ♦ వెలుగుచుండ
నిలిచి చూచితి నేనును ♦ నిలిచి నిలిచి.
రజనిపతి లేనియామధ్య ♦ రాత్రియందు
"అమ్మ! దీపమ్ము నీహృద ♦ యమ్ముకడను
బెట్టి కన్నెరొ ! నీవేమి ♦ వెదకకె దిపుడు?
ఉండె నాయిల్లు చీకటి ♦ నొంటిగాను
ఇమ్ము దీపమ్ము కన్నెరో? ♦ ఇమ్ము నాకు."
అన్న నిలబడి తలపోసి ♦ యాన్యమందు
జీకటిం దృష్టి పఱిచి యా ♦ వెలునమిన్న
"నెమ్మి దీపంబు దీపోత్స ♦ వమ్మునందు
జేర్చ దెచ్చితి" ననుచు దా ♦ జెప్పి పొయె
నామె చిన్ననిదివ్వె దీ ♦ పాళిలోన
గాలిపోవంగ వ్యర్ధమై ♦ కన్నులార
జూచుచుండితి నిలబడి ♦ చూచుచుంటి

65


అభవ ! యీనాదుజీవిత ♦ మనెడునట్టి
నిండితొల్కాడుగిన్నెలో ♦ నుండి దేవ !
యేమధురదివ్యరసమును ♦ బ్రేమతోడ
గ్రోలుకోరికి యున్నదో ♦ కూర్మి జెపుమ!
ఓకవీంద్ర ! మదీయవి ♦ లోకనముల