పుట:Geetanjali (Telugu).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
64

గీతాంజలి.

"గొంగునీడను దీపంబు ♦ గూర్చి యిట్టు
లెచటి కేగెద? కన్నెరో! ♦ యెఱుగ జెపుమ.
ఉండె నాయిల్లు చీకటి ♦ నొంటిగాను;
ఇమ్మ దీపమ్ముకన్నెరో ! ♦ యిమ్ము నాకు."
అన్న నల్లనికన్నుల ♦ నట్టె యెత్తి
మసకలోజూచి నామోము ♦ మగువ యపుడు
తరణి పడమట గ్రుంకిన ♦ తఱిని నేట
దీపమును దేల్ప వచ్చితి ♦ దెలియు మనియె.
గడు బొడవుగాగ బెరిగిన ♦ గడ్దిలోన
నొంటిగా నేను నిలబడి ♦ యుండి యుండి
కాంచితి జలించుదీపంబు ♦ గంగలోఫ్న
నూరకే కొట్టుకొనిపోవు ♦ చుంట; నంత
రాత్రి నిశ్శబ్ద మగుడు నా ♦ రమణీతోడ
"గన్నెరో! నీదుదీపమ్ము ♦ లన్ని వెలిగె
నెచటి కేగెదు దీపమ్ము ♦ నింక గొనుచు?
నుండె నాయిల్లు చీకటి ♦ నొంటిగాను.
ఇమ్ము దీపమ్ము కన్నెరో! ♦ యిమ్ము నాకు."
అన్న నల్లనికన్నుల ♦ నట్టె యెత్తి
వదన మీక్షించి సంశయ ♦ పడుచు నిలిచి
"దివికి నంకితముగ నాదు ♦ దీప మియ్య
వచినా" నని కడపట ♦ బలికె నామె.