పుట:Geetanjali (Telugu).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
62

గీతాంజలి.

దరగ లెల్లను దమతమ ♦ ధ్వనుల గూర్చి
పల్లవుల జేసి పంపగా ♦ బాతుపడునో,
ఆశతో గూడియున్ననీ ♦ హస్తములను
మధుర మైనపదార్ధముల్ ♦ మమత నిడిన
యపుడు తెలియును నాకు నో ♦ యనుగుబిడ్ద!
యేల విరిగిన్నెలో దేనె ♦ గీలుకొనెనొ
యేల గొప్యమ్ముగా ఫల ♦ జాలమందు
నేర్పుతో మంచిరసములు ♦ గూర్పబడెనో
పూని నవ్వింప నెమోము ♦ ముద్దుగొన్న
యపుడు తెలియును నాకు నో ♦ యనుగుబిడ్డ!
వేకువను నింగిపైనుండి ♦ వెడలుకాంతి
యందు బ్రవహించుసంతొష ♦ మనగ నేము
వేసవిని గాలి నన్నంట ♦ వీచినప్పు
డందు గలిగినయానంద ♦ మనగ నెమొ.

63


తెలిసియుండనిమిత్రుల ♦ దెలియజేసి
నావి గానట్టిగృహముల ♦ దావు లొసంగి
పరిచయము లేనివాని సో ♦ దరుని జేసి
దూరమును దగ్గఱగ జేయు ♦ దొరవు నీవు.
ఉండి పరిచయమైనట్టి ♦ యునికి నీడ