పుట:Geetanjali (Telugu).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

61

గీతాంజలి.

నర్ధచంద్రునివెలిమిను ♦ కంటినపుడు
మించునీచిన్ని నవ్వు న ♦ న్మించె దొలుత
ననుచు నుందురు జను లిల ♦ననుచుంద్రు.
శిశువు సర్వాంగములయందు ♦ జేరి యలరు
మృదుమధురమైనక్రొంనగి ♦ యింతవఱకు
నెచట దాగెనో యెవడేని ♦ నెఱిగి యున్న ?
తల్లి చిఱుకన్నియగ నుండు ♦ తఱిని నిద్ది
కోమలావ్యక్తగూఢన ♦ త్స్రేమ గూడి
యామొహృదయాన వ్యాపించి ♦ యణగి యుండె.

62


పలు తెఱంగులరంగుల ♦ గలసి వెలుగు
క్రీడవస్తువులను నీకు ♦ బ్రీతి నిడిన
యపుడు తెలియును నాకు నో ♦ యనుగుబి
యిన్నిరంగులు మేఘాల ♦ నేలగలవొ?
యిన్నిరంగుల నీటిలో ♦ నేలగలవొ?
పూలలో నేల రంగులు ♦ పొదుగబడెనొ.
ఆడుటకు నిన్ను గొల్ప నే ♦ బాడదొడగు
నపుడు తెలియును నాకు నో ♦ యనుగుబిడ్ది!
యేల నాకులలో గాన ♦ లీల గలదొ?
యేల నాలించు భువి హృద ♦ యమ్ము సొక