పుట:Geetanjali (Telugu).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
22

గీతాంజలి.

26

అతడు వేంచేసి నాయొద్ద ♦ నలరుచుండె;
గాని మూర్ఖత నేను మే ♦ ల్కాంచనయితి.
ఇంతపాపిష్టినిద్ర నా ♦ కేల బట్టె;
నెంతదౌర్భాగ్యవంతుడ ! ♦ నెంతజెడుండ?
స్వామి దయచేసె రాత్రి ని ♦ శ్శబ్ధవేళ;
జేతులను వీణ యెంతయు ♦ జెలగు చుండె;
పరమనోహరన్మృదు ♦ ధ్వనులచేత
బ్రతిరవము లీనజొచ్చెనా ♦ స్వప్నములను.
ఏల నశింయించె నారాత్రు ♦ లివ్విధమున?
నెవనియూపిరి నానిద్ర ♦ నెలమినంటు
నతనిదృష్టికి నేనిట్తు ♦ లనవరతము
దప్పిపొవుట యేలోకో ♦ చెప్ప జాల.

27


దీపమా ? యేద నున్నది? ♦ దీపమేడ?
దానివెలిగించు మందు నా ♦ శానలంబె?
జ్వాలయే లేదు దీపంబు ♦ వలన నేమి ?
హృదయమా ! నీదుగతియెల్ల ♦ నింతయేని
మృత్యువే దీనికంటెను ♦ మేలు నీకు.