పుట:Geetanjali (Telugu).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

యర్ధ మంతయు జెప్పుమం ♦ చడుగుచుంద్రు.
ఏమిచెప్పంగవలయునో ♦ యెఱుగ గాన
నర్ధమెఱిగిన వా రెవ్వ ♦ రనిన నన్ను
దేవ ! నవ్వుచు నిరసించి ♦ పోవుచుంద్రుల్;
కూరుచుందువు చిఱునవ్వు ♦ గూడి నీవు.

103


నాధ ! యొకవందనమ్ముతో ♦ నాకు నున్న
యింద్రియములెల్ల బురివిచ్చి ♦యిజ్జగంబు
నంటు గావున నీచర ♦ ణాబ్జమందు !
నాధ ! యొకవంద్సనమ్ముతో ♦ నామనంబు
నీరముల నిండి కురియని ♦ నీరదంబు
నింగిలో శ్రావణమ్మున ♦ వంగినట్లు
వంగుగావుత నీమహా ♦ ద్వారమందు !
నాధ ! యొకవందనమ్ముతొ ♦ నాదువివిధ
గతుల గీతమ్ములెల్లను ♦ గలసియేక
పూరమై శాంతవారధి ♦ జేరుగాత !
గూండ్లు కరుగగ మనసులో ♦ గోర్కిపుట్టి
పర్వతంబుల నుండెడు ♦ పట్టులకును
రేయిపవలును వదలక ♦ పోయిచేర
నరుగుచుండెడుబకపాళి ♦ యందమునను