పుట:Garimellavyasalu019809mbp.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి యొక్క గద్య రచనలలోని శైలికి సంబంధములేని శైలిని ఒక దానిని తెచ్చి పెట్టగోరిన ప్రయోజనము లేదు గ్రాంధికమో గంధికమో దానికొక శైలి యనే పేరు, దానితో అనేక గ్రంధముల వ్రాత, అనేకులు పండితపామరుల కవి సుబోధములై చదువుకోవడం, ప్రౌఢకవుల ప్రౌడ గ్రంధకర్తలే కాకుండా క్రొత్తగా లేచుచున్న బాలకవ్లు బాలవ్యాసకర్తలు కూడా దానిలో ఇంచుమించుగా వ్రాయగలగడం చేస్తే, దానిని పిలకట్టు కొని యీడ్చి వేయడము అంత సులభము కాదనిన్నీ అట్లు యీడ్చి వేయవలసినంత మహాపరాధమేమి అది చేపట్టలేదనిన్నీ అందరికీ సుబోధకము కాగలదు. వారు చేసిన అపరాధమంతా ఒక్కటే. ప్రజల భాషలోని యింపితములగు ప్రయోగములకు, అనగా శిష్ట భాషకు, మన పూర్వ గద్యకారు లందరూ చోటిచ్చి యుండగా, చిన్నయ్యసూరి గారి దగ్గర నుండి తరువాత వరెవ్వరూ దానికి తగిన స్వాగత మీయక ఆశ్లీలము క్రింద్ త్రోసి పారవేయబూనినారు. అదియును వారికి సాధ్యము కాలేదు. వారికిష్టము లేకున్నా వారికి తెలియకుండానే ఇవి కొన్ని వారివ్రాతలలో తగిన స్థలములు వెతికి చూచుకొని కూర్చున్నవి. అవి అన్నీ దిద్దుకోవడానికి కొందరు ప్రముఖులు గడగడము అవివేకము వాటికస్ప్ర శ్యతా దోషము నారోపించి మెడపట్టి గెంటివేయడము మన భాషా సాంప్రదాయమునకు విరుద్ధము. పైగా వారి కర్తవ్యమో అంతకు విరోదమై సవ్యమైనది. అదియేదనగా వాటికిని వాటి వంటి ఇతర వ్యావహారికములకును అనుశాసనం చేసి గ్రంధ భాషకును శిష్ట వ్యవహార భాషకును పొత్తు గూర్చి శైలిని సజీవము చేయుట, వ్యావహారిక వాదులు తమ శిష్ట ప్రయోగముములను అనుశాసన్ము చేసి గ్రంధ బాషకును శిశ్హ్ట వ్యవహార భాషమును పొత్తు గూర్చి శైలిని సజీవము చేయుట, వ్యావహారిక వాదులు తమ శిష్ట ప్రయోగములకు వర్తమాన రచనల యందును శైలి యందును తావు దొరకవలె ననియె ఆందోళనము చేయవలెను గాని యేభై సంవత్సరముల నుంచి ఆయెను పండిత గ్రంధకర్తలును, బహ్జజనులచే చదివి ఆనందింపబడు వారును అగు వారల కలవాటయిన శైలిని సమూలంగా ఒకసారి నిర్మూలము చేయవలెనని కొరుట అసాధ్యపు కోరిక అనర్ధము కూడా నేమో తెలియదు. అది అలవాటై, నిర్ధుస్ఝ్టమైతే,ఇది వాస్తమై మనోహరమైతే రెండూనూ చెట్టాపట్టాలు పట్టి తిరుగుతూ ఒక్కటి కావడానికేమీ అభ్య్హంతరం లేదు ఉందకూడదు. మన హరికధలు, వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు, జానపదములు, స్త్రీల పాటలు, వేదాంత తత్వములు మొదలగు వానిలోని