పుట:Garimellavyasalu019809mbp.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భాషలో గ్రాంధిక వ్యవహారికములకు మధ్యన ఎటువంటి యేళ్లు కాని సముద్రాలు లేవు రెండు రెండుగా వుండక ఒక్కటిగా వుండి పండిత పామరజన సుబోధకములై అందంగా వుండేవి. రెండింటిని వేఱుచెయ్యడం రెండవదానిని ఆంక్ష పెట్టడం క్రొత్త శిష్టుల ప్రారంభీంచిన పద్దతి దీనిపైనే రామమూర్తి పంతులు గారు జెండా యెత్తి నారనిన్నీ దీనిని తొలగించుటకును రెండింటిని పొత్తుకూర్చుటకునే వీరేశలింగము నాటి నుండి నేటివరకు వచ్చుచున్న గ్రాంధికవాదులయ్యు సంస్కార ప్రియులెల్లరు అభిప్రాయపడుచున్నారనిన్నీ నాతలంపు. ఇట్లయినచో ఇరువురయుచెలిమి కూడుత కష్తము కాదు.

  శిష్ట గ్రాంధిక శైలి మీదకు కూడ తిరుగబడి దానిని నిర్మూలము చేయగోరుట వ్యావహారిక వాదులకు సముచితము కాదు. మనదేశములో అనుశ్రుతముగా వచ్చుచున్న సామాన్య జనుల సాహిత్యము కూడా అట్టి కార్యమునకై గడంగక దానికి తగిన గౌరవము చూపుచు వచినది అందేమాత్రమును తప్పు కాని సంప్రదాయవైరుద్యము కాని లేదు. వ్యావహారిక వాదులు మరి క్జొని వాడుకపరములనూ ప్రయోగములనూ శిష్ట గ్రాంధిక రానలలోకి చేర్చుకొనవలసిన వాటి కనుశాసనము చేయవలసినదాన్ని కోరుచున్నారు. అనుశాసనము చేసినంత మాత్రమున వాటినే తప్పో గ్రాంధికములను వ్ర్రాయనే కూడదను సిద్దాంత మేర్పడునని వారి యుద్దేశ్యము గాని నాయుద్దేశ్యము గాని కాదు. అవి అలవాటయినవారు వాటినె వ్రాతురు. ఇవి బాగుంటాయి అని తోచిన వారు వీటి నుపయోగించవచ్చునుం ఇవి రెండూను కలసిమలసియే యుండవచ్చును అట్లున్నచో ఒకటి నొకటి వెక్కిరించు నట్లుండునని ఆక్షేపించి అటువైపునకో ఇటువైపునకో కోరి దిద్దుకొనుటకు ప్రయత్నించడం నా కంత శ్లాఘ్యముగా తోచలేదు. ఈ విశ్వాసముతోనే నా రచనలనన్నిటిని నేను సాగించుచున్నాను. ఇట్లు చెయుటవలన నేనిరువురి హెళలకూ పాత్రుడ నగుచున్నానని యెరుగుదును. అయినను నా విశ్వాసము నుంది తప్పుకొనుటకు నాకు సాద్యమును కాకున్నది, అవసరమును తోచకున్నది.
  నే నెన్ని సారులు చర్చచేసి యాలోచించినను ఈ రెండింటిని