పుట:Garimellavyasalu019809mbp.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హెచ్చజొచ్చినవి ఇట్టి భావములు పొడమునున్నట్లును అభివృద్ది యగునట్లును శ్రీ గిడుగు రమమూర్తి పంతులు గారి సిద్దాంతములు. తర్కములు, ప్రచురణములు, ప్రయత్నములును మిక్కిలి శ్లాఘ్యములనుటలో సందేహము లేదు.

   గద్య గ్రంద్ష భాష ఎంతవరకు కేవలము వాడుక భాషగానే నుండవలను. ఎంత వరకు దానికి సన్నిహితమై యుండవలెను. ఎంతవరకు దని కీషదతీతమై యుండి "కృతకము" గా ఉండవలెను అను సమస్యలకు విద్వాంసులు వారి వారి అభిరుచులకు తగినట్లు అభిప్రాయ భేదములను కలిగియున్నారు. గ్రంధకెర్తలును అట్లే వివిధ శైలులలో వ్రాయుచున్నారు. కాని ఎంతవరకో కొంతవరకు కేవలము వాడుక భాషకు  కొంచంతీతమై యుండవలెననియు, ఇంచుమించుగా అందరును అంగీకరించుచున్నారు. ఇందుకై చేయవలసిన భగీరధ ప్రయత్నము కూడా  విస్తారమేమీ లేదు. కొన్నిమాండలికములు కొన్నిదేశ్యములు, కొన్నిఅన్యయములు, సంధులు, విసందులు సముచ్చయములు పేరు మోసిన గ్రంధములో నున్నవాటిని కొన్నింటిని,లేకుండానే శిష్ట వ్యవహరములో ఉండే వాటిని కొన్నింటిని వైకల్పికముగానో బహుళముగానో ఆధునిక గద్యములో ప్రయోగించవచ్చునని అన్ని మండలముల లోని పెద్దలును గలసి  ఒకతీర్మానమునకు వచ్చుటయే దీనికి కావలసిన దంతయు ఎద్దలు కొంతవరకు తమ అహంకారములనుజ్ మానుకొనుటయు, కొంతవర్కు తమప్రతికక్షులను కొనబడు వారి యభీప్రాయముల పట్ల కొంత  సహనము చూపుటయూ మాత్రమే తప్పు అరసున్నలు తప్పుబండిఱాలు ప్రయోగింపకుండా సరియైనవి మాత్రమే ప్రయోగించవచ్చును. మానితే మానవచ్చును అన్న షరతుకు వ్యవహారిక భాషావాదులొప్పుకొనవలెను. తప్పుని ప్రయోగించకుండా సరియైనవి మాత్రమే ప్రయోగించవచ్చును. మానితే మానవచ్చును అన్ని షరతుకు వ్యవహారిక భషావాదు లొప్పుకొనవలెను. తప్పుని ప్రయోగించితేనే కృతకము కాని సరియైనవి ప్రయోగించుట కృతకముకాదు. ఇప్పటి గ్రాందిక భాషావాదులను కొంబడువారు కూడఱసున్నలు బండిఱాలు మేము విడువమని చెప్పుదురు. మాత్రమే కాని తప్పుగా ప్రయోగించుతామని వారిలో కొందరు తర్కకౌశల్యము కొరకు వాదింతురే కాని వ్రాత సమయమున పాటించలేరని వారి గ్రంధములు చదివిన వారికి
గరిమెళ్ళ వ్యాసాలు