పుట:Garimellavyasalu019809mbp.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్రొత్త అనుశాసనము

  ఆంధ్ర బాషలోగద్యము యొక్క అవశ్యకతయూ ప్రచారమునూ మిక్కిలి హెచ్చుచున్నది. ఆంధ్రశబ్దచింతామణి మొదలగు వ్యాకరణములు పద్య కవిత్వములో నుపయోగింప వలసిన ప్రయోగములను మాత్రమే విశదీకరించి చప్పునుగాని భాషాశాస్త్రము ను గూర్చి గాని మామూలు గద్యమునకు సరిపోయెడి పదములు వాక్యములు సంధులు మొదలగు వానిని గూర్చి కాని అధికముగా చెప్పవు. పద్య గద్యములకు పొదుపుగా ఒక్కటే వ్యాకరణము చాలునని వారు తలంచిరేమో! పురాణాదులలో వ్రాయబడేడి వచనములట్లే వ్రాయబడేడివి. కాని మామూలు వచనములు, వ్యాఖ్యానములు, కధలు, శాసనములు మొదలగునవి అట్టి భాషలో వ్రాయబడలేదనుట సువిదితం సుప్రసిద్ధ వ్యాకరణలక్షణ విరుద్దమగు నట్టియు, మామూలు వచనములు, వ్యాఖ్యానములు, కదలు శాసనములు, మొదలగునవి అట్టి భాషలో వ్రాయబడలెదనుట సువిదితము సుప్రసిద్ధ వ్యాకరనలక్షణ విరుద్దమగు నట్టియు, మామూలు మన శిష్ట వ్యవహార భాషకు సన్నిహితమగు నట్టియు భాషలో అగ్రతాంబూలాదులు వ్రాయబడు చుండెడివి. ఇట్లు వ్రాయబడిన గ్రంధములెంత మాత్రమును కొంచెము కావు. అట్లయినను వీటికి వేఱే యొక లక్షణము వ్రాయకుండుట బట్టి అవి ప్రత్యేక లక్షణమంటూ ఉండవలసిన అవశ్యకత యెకొటి లేదనియువారు తలంచిరని మన మూహించుకోవలెను.
      కేవల గద్య కావ్యములును, సులభ గ్రాహ్యములగు ప్రసంగములు, కధలు, వింతలు, వ్యాసములును ఈ యుగములో హెచ్చజొచ్చి నప్పటినుండియు, ఆవ్యాకరణములు వీటి అభివృద్దికి సరిపడవనియు, వీటి కనుకూలమగు వేఱే వ్యాకరణం వ్రాయనిచో పూర్వవ్యాకరణ సూత్రబంధితమై గద్యరచన పెరుగకుండుట కాని, నియమరహితమై పేలవమగుట కాని తటస్థించుననియు తలంచి గద్యముంకు వేఱే వ్యాకరనము వ్రాయవలసిన అవశ్యకత యున్నదని శ్రీ వీరేశలింగం పంతులుగారే  గ్రహించిరి. ఇట్టి భావము నానాటికి ఆంధ్ర గద్యకారులలోను, భాషా పరిణామశాస్త్రజౣఅలోను వ్యవహారిక ప్రయోగములను సుదరముగా తమ పద్య్హ కావ్యములలోకే జొప్పించిన పూర్ఫ విఖ్యాత కవీంద్రుల గ్రంధమ్లను పఠించెడి వారిలోను