పుట:Ganapati (novel).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గణపతి

85

ములు తొల్లింటి సంపదను గౌరవమును గోల్పోయి లోకము లోని సామాన్య సంసారములవలె నుండు పగిది రాజమహేంద్ర వరము కడ విశాలమైన యఖండగౌతమి యను పేరువడసి నేల పైఁ జరచిన గొప్ప నీటి రేకువలె నొప్పుచుండు గోదావరి ధవళేశ్వరమునొద్ద నేడు పాయలుగ జీలిపోయినందున నా పాయలు వైశాల్యమునఁగాని జలసంపదయందుగాని గాంభీర్యమునఁ గాని యఖండ గౌతమిని బోలక సామాన్యనదులట్లు న్నవి. కొన్ని నామావశిష్టము లైనవి. కొన్ని యంతర్వా హినులైన వని చెప్పుదురు. కొన్ని స్వల్పములై గోస్తనీనది మొదలగు చిన్న యేళ్ళవలెఁ బాఱుచుండును. కౌశికి ఇట్టి వానిలోఁ జేరి పంటదినములలో బుష్కలముగ ధాన్యమున్న కతనఁ గడుపునిండ దిని దేహపుష్టి గలిగి ధాన్యమైపోయిన తరువాత ఫుష్టి లేక బడుగువ లెనుండు పేద రయితువలే వర్ష కాలమున వరద పొడిచి నపుడు కొంచెము విజృంభించి గాంభీర్యము గలిగి దుస్తరమై యుండి శీతకాలమందుఁ గాలినడ కను దాటుట కనువై మండు వేసంగి యందు నీ రేలేక తిప్పలు బయల్పడి యుండును. వాన కారున నేరు పొడిచి నప్పుడు మంద పల్లి యేనుగుల మహలు లన్నవి వేర్వేరు గ్రామములుగఁ దోఁచును, కాని వేసవి కాలమున నొక్కటే గ్రామమని భావింపవలసియుండును. గంగాధరుఁడు స్థలభాండ విసర్జము జేసి మందపల్లి విడచి యేనుగులమహలు చేరునప్పటికి రమా రమి యేఁడు సంవత్సరముల యీడుగలవాడై యేనుఁగు