పుట:Ganapati (novel).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

గ ణ ప తి

రీకమునకుఁ దప్పక వచ్చునని యెఱిగినవా రనేకులనుకొనిరి. కాని కావలసినప్పుడెల్ల గారెలువండుకొని తినుటకు దగిన యేర్పాటు పాపయ్యవలన శాశ్వతముగ జరిగినందున నతఁడు రాలేదు. సంవత్సర మిట్టె తిరిగివచ్చెను. నూరు రూపాయలు గవ్వలవలె కర్చయ్యెను. అందుచేత మరల నూరురూపాయలు పిచ్చమ్మ బదులు పుచ్చుకొనియెను. నాలుగు సంవత్సరములగునప్పటికి యిల్లమ్మి వేయవలసివచ్చెను.

ఆఱవ ప్రకరణము

కూతురు గృహ మమ్ముకొనవలసినప్పుడైన నామెనొక సారి చూచుట కన్నప్పకుఁ దీరిక లేకపోయెను. కాపుర ముండుటకు మందపల్లిలో వారికి మరొకయిల్లు దొరకనందున గంగాధరుని దోడ్కొని పిమ్మట యేనుగుల మహలు గ్రామమునకుఁ పోయెను. మందపల్లి కేనుగులమహలు మిక్కిలి సమీపమున నున్నది. గోదావరి సప్తశాఖలలో నొకటియగు కౌశికి యను పాయ యేనుఁగుల మహలునకు మందపల్లికి నడుమ ప్రవహించు చుండెను. గోదావరిపాయ యను గొప్ప పేరేగాని యదియొక గొప్పకాలువవలె నుండును. మహైశ్వర్యసమన్విత మగు నొక గొప్పకుటుంబము వివాదములు పెరిగి రెండు కుటుంబములుగ భిన్నమైన వెనుక విభక్తకుటుంబ