పుట:Ganapati (novel).pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

337

నవివాహితయైన బాలిక యున్నదని విన్నను దన కామె నిచ్చి పెండ్లిసేయు మని స్వయముగానైన మాతాపితరుల నతఁ డడుగును. లేక యెవరిచేతనైన వర్తమాన మంపును. నీ కెంత యాస్థి యున్నదని యెవరైన నడిగిన పక్షమున నతని కెంతో కోపమువచ్చి యిట్లనును. "ఆస్తి! ఆస్తి! ఆస్తి లేకపోతే బ్రతకలేరా యేమి? ఆస్తి యున్నవారు బంగారము దినుచున్నారా? లేనివారు మన్ను దినుచున్నారా? ఎందు కాస్తి? చచ్చినప్పుడు కూడ తగులవేయుదురా యేమిటి? నేను భార్యకన్నము పెట్టగలనా, లేనా? యని యొక్కమాట విచారించవలెను. మీ యందరి కంటె బాగానే భార్య కన్నము పెట్టగలను. ఆస్తి కావాలట. ఆస్తి పాస్తి! చాలు చాలు! నోరుమూయండి, అధిక ప్రసంగములు చేయక" ఆ పలుకులు విని పిల్ల తల్లిదండ్రులు మధ్యవర్తులు వాని బేలతనమునకు ముసిముసి నవ్వులు నవ్వుచుందురు. ఒకనాడు తల్లి గణపతి కన్నము పెట్టుచు వివాహ ప్రసంగమురాఁగా కోపముగా నిట్లనియె "నాయనా! మన పల్లయ్యమామ భార్యకు నెలతప్పినదట. ఆ మాట విన్నప్పటినుండియు నాకెంతో సంతోషముగా నున్నది." "అయితే మనకేమి లాభమే?" యని యతఁడు బదులుచెప్పెను. "దాని కడుపున ఆడపిల్ల పుట్టినట్లయితే వాడుకూడ నీకు మేనమామే గనుక ఆపిల్లను నీకియ్యగూడదా? యని నాయాశ!" యని యామె బదులుచెప్పెను. ఆ మాట వినఁబడఁగానె గణపతి మిక్కిలి కోపించి "ఓసి భ్రష్ట