పుట:Ganapati (novel).pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

331

హితోపదేశము చేసెను. ఆ యుపదేశము తక్కిన బ్రాహ్మణ బాలకులకును సహేకమై సమ్మతమై తోచినను నదివఱకె హాస్యాస్పదముగ నున్న గురువుగారి చరిత్రము మఱింత పరిహాసపాత్రముగఁ జేయఁదలంచిన యా శూద్రకుమారుని యాలోచనము మిక్కిలి బాగున్నదని ప్రశంసించి యతని మాట కడ్డము చెప్పిన బ్రహ్మణబాలుని వారు చీవాట్లు పెట్టిరి. పందెముల వలనను గ్రుడ్లవలనను విశేషలాభము గలుగునని వినినతోడనే గణపతి కుక్కుట స్వీకారమునకు సమ్మతించి యొక కోడిని దనకు దెమ్మని కాపుల కుఱ్ఱవాని నడిగెను. వాఁడు తన యింటనున్న యొక పెట్టను దెచ్చి మరునాఁ డుదయమున గురువుగారికి గొప్ప కానుకగా సమర్పించెను. ఆ యులుపా గ్రహించి గణపతి పరమ సంతోష భరితుఁడై దాని కొక గది యేర్పరచి కన్నబిడ్డవలె దాని నాదరింపఁ జొచ్చెను. బడిలో చదువుకొను పిల్ల లందరు వంతుల ప్రకారము దినమున కొక్క పిల్లవాఁడు దాని నిమిత్తమై తఫుడు తేవలె నని యతఁ డాజ్ఞాపించెను. ఆ ప్రకార మందరుఁ దే దొడగిరి. తవుడు తేలేనివారు గురువుగారియొక్క బెత్తము దెబ్బలకు గురి కావలసినదే. దాని కూతవలన శిష్యులకును గురువునకును మెలుకువ వచ్చుటయు దెల్లవారు జామున వారు కాలువకు స్నానమునకుఁ బోవుటయు మూఁడునాళ్ళ ముచ్చటయ్యెను. పిన్ననాటినుండియుం బెంచిన బద్ధకము వారి శ్రద్ధను కబలింప