పుట:Ganapati (novel).pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

316

గ ణ ప తి

రడిగినప్పుడు 'గరుడాచలము మఁగడ ' నని యుత్తరము చెప్పు చుండును. ఆ పణ్యాంగన భామవేషము కట్టినప్పుడు తాను కృష్ణమూర్తి వేషము కట్టదలచుకొనుటచే నది యొక్కసారియైనను గట్టకమునుపే తా నామె మగఁడైనట్లు భావించుకొని యట్లే లోకమున జెప్పఁ దొడంగెను. వెలవెలఁదుల నిజముగ నుంచు కొన్నవారు సయిత మావిధముగ నెన్నఁడు జెప్పుకొన రని మన మందఱ మెఱుఁగుదుము. అయినను గణపతి సంబంధ మారోపించుకొని, యది తనకు గొప్పతనమే గలిగించునని, తానట్టి యుత్తరము చెప్పుట కవకాశము కలిగినందుకు మిక్కిలి సంతసించుచుండును. గణపతి బ్రాహ్మణయింట భోజనము జేసి, తక్కిన కాలమంతయు గరుడాచలముయొక్క గృహమందె గడుపుచుండును. అంత కొన్నాళ్ళకు కొత్తపేట డిప్యూటి తహసీలుదారు గారు గరుడాచలమును పిలిపించి భామ వేషము గట్టుమని యాజ్ఞాపించిరి. ఆ తహసీలుదారువారి యాజ్ఞ తిరస్కరించుట కొంచెము గొప్పస్థితిలో నున్నవారికే యపాయకరమై యుండ నాదినములలో వెలయాలునకు గొఱవితో దల గోకికొనుట యని వేర చెప్ప నక్కరలేదు. అందుచేత నామె యచ్చటకు వెళ్ళి భాగవతము గట్టెను. హాస్యగాడు మద్దూరి మహాదేవుఁ డను బ్రాహ్మణుఁడు. అతఁడు హాస్యమున మిక్కిలి గట్టివాఁడని పేరు వడసెను. అతని హాస్యప్రసంగమును విని సభాసదులు కడుపు చెక్క లగు నట్లు నవ్విరి. సత్యభామ తెరమీద