పుట:Ganapati (novel).pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

299

బొడిచి చంపినారేమో యని యొకరు, పొడిచిన పక్షమున నెత్తురు, గాయములు కనఁబడవా? యని యొకరు, పలు తెరంగుల నెవరికి దోచినట్లు వారు పలనించిరి. మొత్తముమీద గణపతి సంపూర్ణముగఁ జావలేదనియు, నవసానలక్షణమయిన గురక బైలుదేరిన దనియు క్షణములోనో నరక్షణములోనో కడతేరు ననియు నచటివారు నిశ్చయించిరి. అంతలో మహాదేవశాస్త్రితో సింగమ్మ వచ్చెను. వచ్చి కొడుకు పైఁబడి "నా తండ్రీ! నా కొడుకా! నన్నొంటి దాన్ని జేసి లేచిపోయినావురా! నాకింక దిక్కెవరురా, నాయనా! నన్నుఁ గూడ నీతోఁ దీసికొనిపోరా! తండ్రీ! నా వరహాలచెట్టూ ! నా కాసులపేరూ! నిన్న రాత్రి కడసారి నీకుఁ గడుపునిండా అన్నము పెట్టినానురా, నాయనా! తెల్లవా రే పాడుమొగం చూచినానో గాని యింత దుర్వార్త వినవలసి వచ్చిందిరా, నాయనా! నాముప్పు కడతేర్చి నన్నింత మట్టిచేసి పోదువని అనుకున్నాను గాని యింత పని జరుగునని కలలోనూ నే ననుకో లేదుర నాయనా! నిన్నింత పని చేయుటకు యెవరికి చేతులు వచ్చినవిరా, నాయనా! వాళ్ళ చేతులు పడిపోనూ, వాళ్ళ వంశము నాశనంగానూ! నాలాగే వాళ్ళ తల్లులుగూడ కొడుకా! కొడుకా! అని యెప్పు డేడ్చి మొత్తుకొందురో, నాయనా! నానోట్లో మట్టిపోసి పోయినావురా నాయనా! నా కడుపులో చిచ్చుపెట్టి పోయినావురా, నాయనా! నా కొంప తీసినావురా, నాయనా! ఈ చావు