పుట:Ganapati (novel).pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

గ ణ ప తి

చూచినవారి కన్నము దొరకదు. ఈ గ్రామములో హాయిగా నుండవచ్చును." అనవుడు "సరే మంచిది. అలాగే చేయవచ్చు" నని నాటి మధ్యాహ్నము బయలుదేరి యామె యేనుగుల మహలు వెళ్ళెను.

వెళ్ళి పుల్లయ్యను గలిసికొని యతని సహాయమున నొక బండి దెప్పించి దానిమీద తన సామాను లన్నియుఁ బడవైచెను. ఆ సామాను లెవ్వియో చదువరులు తప్పక యెరుఁగ గోరుదురు. కాన నందు ముఖ్యమైనవి పేర్కొనుట సమంజసము. పాత్రసామానులు చెప్పఁదగిన వెవ్వియు లెవు. వరతంతు మహాముని శిష్యుఁడైన కౌత్సుం డను మునికుమారుడు యాచించ వచ్చి నప్పుడు రఘు మహారాజు వేనిలో నర్ఘ్యపాద్యములు పెట్టుకొని సంభావించెనో యాపాత్రలె వంటకు నీళ్ళకు వారి యింట నుపయోగపడు చుండుటచే నవి పొరుగూరునకు దీసికొని పోఁదగినవని కావనిఁ యింటివారికిఁ గొన్ని, చుట్టుప్రక్కలవారికిఁ గొన్ని దానముచేసి తక్కిన సామానులు మాత్రమే యామె బండిలోఁ బెట్టెను. అవి యెన్ని యన చాలాచోట్ల తోలూడిపోయి రెండు మూఁడు చిల్లులుగల బోనముపెట్టె యెకటి, మూతలేని తాటియాకుల పెట్టె యొకటి, చెవులు విరిగిన ప్రాత రాచిప్పలు రెండు, చిల్లు లుండుటచే గూటిమైనము మెత్తిన యిత్తడి చెంబులు రెండు, యక్షయపాత్ర చెం బొకటి, యుప్పు పోసుకొను కర్ర తొట్టె యొకటి, యంచు జవయూడి మూలలు చిల్లులుపడిన