పుట:Ganapati (novel).pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

263

చేఁటలు రెండు, కఱ్ఱ సోల యొకటి, ప్రాత జల్లెడ యొకటి, జల్లెడవలె తూట్లుపడిన ప్రాత కంబళి యొకటి. ఒకకోడు విరిగిపోయిన నులకమంచము కుక్కె యొకటి. కాడసగము విరిగిపోయిన యినప గరిటె యొకటి. గ్రంధి యూడిపోయిన పీట యొకటి, బల్లచెక్క యొకటి, ఒక సన్నెకల్లు, పొన్నూడిపోయిన రోకలి యొకటి, మరియు నాలుగు మూఁడు తాఁటియాకు బుట్టలు, రెండు మూఁడు వెదురువేళ్ళ బుట్టలు గూడ నుండవచ్చును. ఈ సరుకులు బండిమీఁద వేయించుకొని యామె తాను సోదరుని గృహము వెడలివచ్చిన తరువాత తనకుఁ గుమారునకుఁ దల దాచుకొనుట కిల్లిచ్చి సాయముచేసిన యా యిల్లాలిని పలు తెరంగుల గొనియాఁడి యామెను వీడ్కొని పుల్లయ్య చేసిన మేలునకు వానిని గూడ కొంతతడవు ప్రశంసించి వానికడ సెలవు గైకొని పుట్టినింటివారిఁ దలంచి "వాండ్రు నా యుసురుగొట్టి, పోకపోదురా! ఆఁడుపడుచు నేడిపించినవాళ్ళ వంశములు నాశనము గాకమానవు. దాని పుట్టిల్లుగూడ బుగ్గి యైపోవలె. నా యాశలాగె దాని యాశలుగూడ అడుగంటిపోవలె. దాని కడుపుకాలిపోవలె. దాని వాళ్ళందరు వల్ల కాటిపాలై పోవలె" అని తోచినట్లు తిట్టి "పుల్లయ్యతండ్రీ ! యేనుగుల మహలుకు నాకు ఋణము నేటితో దీరిపోయినది. ఈ పాటిమీఁదనే చావవలె ననుకొన్నాను. ఈ పాఁటిమీదనె మట్టి కావలె ననుకొన్నాను. మా వెధవ నాగన్న మూలమున, ఊరికి