పుట:Ganapati (novel).pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

గ ణ ప తి

మేనమామయుఁ గ్రమక్రమముగ గోపపువేఁడి చల్లనగుటచే గణపతిని చూచియు నూరకుండెను.

పదమూడవ ప్రకరణము

తోఁబుట్టువు, మేనల్లుడు దనగృహమునందె యుండుట చేత నాదాయముకంటె వ్యయ మెక్కువై నాగన్నకు నలువది వరహాలప్పయ్యెను. మేనల్లుడైన గణపతి కుటుంబమునకుఁ జేయు నట్టిది కలహాదాయమే గాని యన్యము లేదు. ఋణప్రదాతలు నాగన్నను ఋణము దీర్చుమని పలుమారులు వేధింపఁ జొచ్చిరి. అప్పు వడ్డితో నేబది వరహా లయ్యెను. ఈ ఋణము దీర్చునట్టి యుపాయము నాగన్నకుఁ గనబడదయ్యెను. ఒకనాఁటి సాయంకాల మప్పులవాఁడు వ్యాజ్యము నేయుదునని మిక్కిలి తొందరసేయ, నాగన్న విషాదభరిత మనస్కుఁడై సరిగా భోజనము చేయక మంచముమీఁదఁ బండుకొనియుండఁ గంగమ్మ భర్త యవస్థజూచి ఋణవిమోచన కుపాయముఁ జెప్పఁదలంచి యిట్లనియె.

"ఈ లాగున బెంగపెట్టుకొని అన్నము తినక నిద్రపోక విచారపడినంత మాత్రాన ఋణము దీరునా? దీనికి నాకొక్క యుపాయము తోఁచినది. అది చెప్పుచున్నాను వినండి. నా యుపాయము మంచిదైతే నే చెప్పినట్లు చేయండి. లేకపోతే