పుట:Ganapati (novel).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

గ ణ ప తి

పాతకము లడఁగును. పఠియింపని వారు చదపురుగులై పుట్టి మఱియొక జన్మమునఁ బుస్తకముఁ దిని వేయుదురు.

అని చెప్పి తన వృత్తాంతము సంగ్రహముగ నాకెఱిఁగించెను. నాలుగు కునికిపాటులలో నాలుగుపావులు చెప్పి సంగ్రహమైన యీ కథ ముగించి నీ కేమైన సందేహములున్న నడుగుమని మఱి మఱి యడిగెను. అడుగుటకు నేను ప్రయత్నములచేసి నోరు తెరవఁబోవుచుండ వడ్డన బ్రాహ్మణుఁడు నాచేతిమీఁద వేడిచారు పోసెను. నేను విస్తరి ముందరఁ గూర్చుండి చారెంతసేపటికి రాకపోవుటచే గొడకు జేరఁబడి దొన్నెలోఁ జేయిపెట్టుకొని కునుకుచు స్వప్నసుఖమనుభవించుచుండఁగా మోట బ్రాహ్మణుడు నా చేయిగాల్చెను. అందుచేత నాకు మెలకువ వచ్చెను. మరలమజ్జిగ వచ్చునప్పటికిఁ గొంతయాలస్యమైనది; కాని చేతి మంటచే నిద్ర పట్టినదికాదు. మరల నిద్రపట్టిన పక్షమున గణపతి నా కలలో మరలఁ గనఁబడి నా సందియములఁ దొలగించి యుండును. మఱియొకసారి యడుగుదమని తలంచితిని గాని నాటికి నేటికి మరల నతఁడు స్వప్నమునఁ గనబడలేదు. భోజనానంతరమున నేను నా గృహమంబున కరిగి మంచముపైఁ బండుకొంటిని. కాని నిద్రపట్టినదికాదు. భుజించిన వంటకములు త్రేన్పు రాఁదొఁడగెను. గణపతి చరిత్రము స్మృతిపథమున నిలువఁజొచ్చెను. అతని మూర్తి నాకన్నుల యెదుట నిలిచినట్లే యుండెను. ఇది నిజముగా స్వప్నమైయుండునా