పుట:Ganapati (novel).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

17

కుఁడనుగాను, నా చరిత్రము మిక్కిలి రమణీయమైనది. ఇది మీ రాంధ్రభాషలో రచింపవలయునని నాకోరిక. నా చరిత్రము మిక్కిలి లోకాపకారము. ఇది మీరు తప్ప మఱి యెవ్వరు వ్రాయజాలరు. సాహిత్యవిద్యా చతుర్ముఖులైన విద్వాంసులు లోకమున ననేకులు కలరు. తర్కవ్యాకరణశాస్త్రపారంగతులగు పండితులుఁ బెక్కండ్రు కలరు. కాని వారిచేత నా చరిత్రము వ్రాయించుకొనవలయు నని నా కిష్టములేదు. వారు నా చరిత్ర వ్రాయఁదగరు. వారెంత సేపు భావాతీతములైన యుత్ప్రేక్షలతో నతిశయోక్తులతోఁ గాలక్షేపము సేయుదురు. వారిదృష్టికి వెన్నెలలు చందమామలు తామరపువ్వులు కలువపువ్చ్వులు హంసలు చిలుకలు తోటలు కోటలు మేడలు మిద్దెలు మలయమారుతములు విరహతాపములు మకరంద ప్రవాహములు మొదలయినవే వచ్చును కాని నిగర్వమైన నా చరిత్రము వారికి నచ్చదు. అందుచేత గీర్వాణవిద్వాంసుల గీర్వాణముఁ జూచిన నాకు దయలేదు. ఇప్పుడు నా చరిత్రము మీకు చెప్పెదను. విని వ్రాయకపోయిన పక్షమున మీరు కాశీలో గోహత్య జేసి నట్లె. ప్రయాగలో బ్రహ్మహత్యసల్పినట్లే. కురుక్షేత్రములోఁ గుక్కను తిన్నట్లే. ఇంతకు మీరు వ్రాయని పక్షమున నేను దయ్యమునై మిమ్మును మీ వంశము వారిని బదునాలుగు తరములవరకు బట్టుకొని పీకికొని తినియెదను; జాగ్రత. మీరు వ్రాసిన తరువాత నాచరిత్రము పఠియించిన వారికి పంచమహా