పుట:Ganapati (novel).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

గ ణ ప తి

మందలించెను. చాకలి వెధవవు బ్రాహ్మణునికంటె నీ వెక్కు వెరుగుదువా? అవతవక ప్రసంగములు చేయక తీసికొనిరా. నీవు నీగాడిదె నీయకపోతే మఱియొక గాడిదెను తేగలను. ఊరునిండ కావలసినన్ని గాడిదెలున్నవి. నీ గాడిదెనే యిచ్చి తివా ఆవకాయ, మాగాయ, పచ్చళ్ళు, కూరలు నీకు దెచ్చి పెట్టుచుందును. నేనప్పు డప్పుడు బ్రాహ్మణార్థములు చేయుచుందును. చేసినప్పుడు నావిస్తరిలో వడ్డించిన యరిసెలు, గారెలు యజమానులు జూడకుండ చెంబులలో పెట్టి కాని దొన్నెలలో బెట్టికాని దాచితెచ్చి నీ కిచ్చుచుందును. భోజనమునకు వెళ్ళినప్పుడుగూడ నీలాగే బూరెలు తెచ్చిపెట్టుదును. కావలసినన్ని చుట్టలు నప్పుడప్పుడు డబ్బులు నీకు బహుమాన మిచ్చుచుందును. లేనిపోని శ్రీరంగనీతులు చెప్పక తీసికొనిరా నీ గాడిదెనని తిట్టి యాసగొలిపి వాని నొడంబఱచెను. వాఁడును దన మైలగుడ్డలు మోయునట్టి గాడిదెను తీసికొనివచ్చి యెదుట బెట్టెను. గణపతి కప్పటికి పదునాలుగేండ్ల వయస్సున్నను వయసుకు దగినంత పొడగరి గాకపోవుటచే దానిపై కెక్కలేక చాకలివానిని క్రింద గూర్చుండఁ బెట్టి ముందు వాని భుజముమీఁదనెక్కి పిమ్మట గార్దభవాహన మధిరోహించెను. కళ్ళెము లేకుండ దానిమీఁద నతడు కూర్చుండుట కిష్టము లేకపోయెను. త్రాటియాకులు గుది కళ్లెముగ నుపయోగింపుమని చాకలివాఁ డుపదేశించెను. "చదువు కొన్న వానికంటె చాకలివాఁడు మేలన్నమాట నిజమైనది. నీ