పుట:Ganapati (novel).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

113

మీకు ముప్పదిరూపాయలు మీ కానిస్టేబులు లందఱికి నేబది రూపాయలు, మీ యినస్పెక్టరుగారికి ప్రత్యేకముగా నూరు రూపాయలు, మామూళ్ళిచ్చుచున్నాము. అవిగాక మీపై యుద్యోగస్తులు వచ్చినా రన్నపుడు కోళ్ళు, కోడిగ్రుడ్లు, రెండు మూడుసారులు మేఁకలు, పాలు పెరుగు మీకిచ్చినాము. చిక్కువచ్చినపుడు కాపాడకపోయిన మేమేమి కావలసినది? అతనిని మేము చంపలేదు. వాఁడు జూద మాడుటకు వచ్చిన మాట నిజము. అతనికి రాఁగానే గుండెలలో నొప్పివచినది. జాముసేపు గిజగిజ తన్నుకొని చచ్చినాఁడు. ఇదిగో యైదువందల రూపాయల మూట; అది తమరు పుచ్చుకొని యనుగ్రహించి మమ్మొక దరికి జేర్పవలయును." ఆ మూట చూడఁగానే యతఁడు కూనీమాట మఱచెను. "ఏడిచినట్లెయున్నది, గుండెలలో నొప్పివచ్చి యితఁడు పోయినమాట నిజమైయుండవచ్చును. కాని త్వరగా నేదియొ యొకటి తేల్చుకొండి. రెండుజాములు దాటిపోయినది. మీరు మంచివాళ్ళన్నమాట నాకు తెలియను గనుక వదలివైచినాము. మఱియొకరైతే యీపాటికి మిమ్మందరను స్టేషనులో బెట్టియుందును. ఇఁక మేమిక్కడ నుండగూడదు. మీ పని మీరు చేసికొనుఁ"డని భటుల నిద్దరను వెంటబెట్టుకొని యతఁడు పాపము మూట గట్టుకొన్నట్లె యైదువందల రూపాయలు మూటగట్టుకొని భటులకు జెరియొక పాతికరూపాయ లిచ్చి తన జాతకము మిక్కిలి గొప్పదనియుఁ దనయట్టి యదృష్టవంతుఁడు లేఁడ