పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రశ్న: శూద్రుల విషయమై కొన్ని స్మృతులలో వేదాధికారాదులు లేనట్లు వ్రాసియున్నారు. దీని నెట్లు సమన్వయింతురు?

ఉత్త: అట్టివానియందలి దర్మములు సామయాచారిక ధర్మములు. రాగద్వేషములతో గూడినట్టి స్మృతులు ప్రమాణము గానేరవు. శృతికి విరుద్ధమైన స్మృతులు ప్రమాణములు కావు. వేదాధికారము లేదని వ్రాయు సూత్రములు ద్వేష యుక్తము లయినవి. మరియు వేద విరుద్ద ములగుటచే అప్రమాణము లయినవి.

ప్రశ్న: భోజనములందు అందరును కలిసి భుజింపవచ్చునా? (Interdining)

ఉత్త: శాస్త్రాక్షేపణము ఈ విషయమున లేదు. ఆచారమే ఆటంకము కలిగించుచున్నది. దాక్షిణాత్యులలో నీ యాచారము తీక్షణముగా నున్నది.

ప్రశ్న: హిందూసంఘము యొక్క పరమావధి ఎట్లుండును?

ఉత్త: అందరును వేదముల జదివి యజ్ఞోపవీతధారణ మొనర్చుటయే దాని పరమావధి."*[1]

ఇట్టి ప్రశ్నోత్తరములలోనే భగవానుని యభిప్రాయములు ఇట్లున్నవి.

  1. * జయంతి సంచిక-పుటలు 73, 74, 75