పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. దేశోద్ధరణ ప్రచారము

1923 డిశంబరులో కాకినాడ యందు జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలకు శ్రీ బులుసు సాంబమూర్తి నాయనను ఆహ్వానించెను. అక్కడ స్త్రీల హక్కులను గూర్చి యొక సభ ఏర్పాటయ్యెను. అందులో ఉపనయనము, హోమము, శ్రాద్దము మొదలగు వానిలో పురుషులతోపాటు స్త్రీలకు సమాన హక్కు కలదని, నాయన వేదశాస్త్ర ప్రమాణములతో నిరూపించెను. తరువాత ఆలమూరులో అస్పృశ్యతా నివారణమును గూర్చి జరిగిన సభకు నాయనను అధ్యక్షునిగా వరించిరి. క్రైస్తవులు మొదలుగా ఇతర మతములవారి విషయమున స్పర్శదోషము సడలింపబడు చున్నప్పుడు మన మతమునకు చెందిన పంచములయెడ సడలించు కొనక ఆర్భాటములు సలుపుట హాస్యాస్పదమని నాయన ఉద్ఘాటించెను. ఆచారవంతులు తమ యాచారమును తమ యింటి వెలుపల నున్నవారు మన్నించ వలెనని నిరంకుశులై ప్రవర్తించుట తగదనియు ఆయన అధ్యక్షుడుగా ఉద్బోదించెను. అక్కడ నుండి తిరువణ్ణామలైకి పోవుచు ఆయన కొన్ని గ్రామములలో ఈ భావములను బోధించెను. మల్లాది శ్రీకృష్ణచయనులు అను పండితుడు నాయన వాదమును ఖండించుచు వ్యాసములు వ్రాయగా, నాయన వానికి అన్నింటికి సమాధానములు వ్రాసి ఆయనను నిరుత్తరుని గావించెను.

రాజకీయములలో చేరుటకు ఇష్టము లేకున్నను కార్యకర్తల యొత్తిడి వలన వాసిష్ఠుడు ద్రవిడ రాష్ట్రీయ కాంగ్రెసునకు 1914 లో అధ్యక్షు డయ్యెను. ఆ సంవత్సరము డిసెంబరులో బెల్గామునందు కాంగ్రెసు మహాసభలో పాల్గొని ఆయన అస్పృశ్యతా నివారణము