పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శ్యామ్ శ్రీచరణ్ బాబాగారి

"శ్రీముఖము"

ఓం నమో భగవతే, శ్రీ రమణేశ్వరాయ, అరుణాచలేశ్వరాయ, ఆధిమధ్యాంత రహితాయ, అప్రమేయాయ, ఆనందదాతాయ నమోన్నమ:

అభ్యర్థన:- ఈ జీవిబుద్ది పరిమితము. వ్రాశేది అపరిమితమును గురించి. ఇది సబబుకాదని తెలుసు. ఆశ యనెడి పాశము ఊరకే నుండనివ్వక తెలిసీ తెలియని ఆలోచనలను రేకెత్తించి ఏవేవో అక్షరవాక్య విన్యాసాలను చేయిస్తున్నది. పరమాత్మ సృష్టిలోని జీవి మాటలు, చేతలు, వ్రాతలు వచ్చీరాని మాటలవలె, నడకలవలె తడబడుతూ వుంటాయి. అవి కొన్ని జీవులకు, సంతృప్తిని, మరికొన్నింటికి అసంతృప్తిని, మిగిలిన వానికి ఉదాసీనత, నిరుత్సాహము....... వగైరాలను కలిగించుట ప్రకృతి సహజము. తుమ్ము, దగ్గు, వమనములను ఆపుకోవడానికి ప్రయత్నించడము ఆరోగ్యానికి క్షేమకరం కాదని పెద్దలంటారు. అలాగే సక్రమమని అన్పించిన దానిని అక్షర రూపంలో నిర్భయంగా పెట్టలేక పోవడం కూడా భవరోగానికి మంచిదికాదు. ఎందుకు? తద్వారా త్రికరణ శుద్ది లోపించడమే కాక "నేను" బలమై బుద్ధిశక్తి నిర్వీర్యమై, అకాశవాదము నుండి దిగజారి అశాశ్వతమగు అవకాశవాదమునకు మూలమౌతుంది.

పిచ్చివారి వెఱ్ఱి వ్రాతలు తలరాతలను మార్చగలవోలేవో కాని, మనోరాతలను మాత్రం కదిలించక మానవు. అదే పిచ్చివాని వెఱ్ఱి వ్రాతలలోని గమ్మత్తయిన మనస్సుకు హత్తుకునే మహత్తు.