Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ రచనా కాలమున గ్రీష్మమునందు కూడ ప్రతి సాయంకాలము ఇంద్రాణి దేవత విద్యుత్ పరంపరలను చూపుచు తన యనుగ్రహమును ప్రకటించుచుండెను. నాయన పడైవీడునకు పోయి రేణుకా దేవి సన్నిధియందు ఆ గ్రంథమును పఠించెను. అప్పుడు ఆదేవి సాక్షాత్కరించి వినుచున్నట్లుగా కొందరకు గోచరించెను.

ఆ గ్రంథమున నాయన యొకచోట తన లక్ష్యములను వివరించుచు ఇంద్రాణిని ఇట్లు ప్రార్థించెను.[1] "స్త్రీల స్వాతంత్ర్యమును రక్షించుట కొఱకు, పంచముల యపారమైన దైన్యమును తొలగించుటకు, ధర్మము పేరుతో ప్రబలుచున్న యధర్మమును హరించుటకు, గంభీరమైన వేదార్థమున సందేహములను దీర్చుటకు, ఘోరమైన వర్ణభేదమును నాశ మొనరించుటకు, అమ్మా! నా బుద్ధికి శక్తికి మహోల్లాసమును ప్రసాదింపుము".

శ్లో|| స్వాతంత్ర్యం వనితానాం త్రాతుం మాత రథీశే
    దూరీకర్తు మపారం దైన్యం పంచమజాతే:
    ధర్మ వ్యాజ మధర్మం భూలోకే పరిహర్తుం
    వేదార్థే చ గభీరే సందేహా నపి హర్తుం
    ఘోరం వర్ణవిభేదం కర్తుం చ స్మృతిశేష
    ముల్లాసం మతిశక్త్యో ర్మహ్యం దేహి మహాంతమ్||

  1. * జయంతి సంచిక - వాసిష్ఠుని ఇంద్రాణి - డాక్టర్ ప్రసాదరాయ కులపతి M. A., Ph. D. - పుట. 56.