పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'శ్లో|| అష్టవర్షా భవేత్ కన్యా' ఇత్యాది శ్లోకములు కల్పితములని, కన్యాత్వము రజో దర్శనముతో ఆరంభ మగునని, తరువాత మూడేండ్ల వఱకు వివాహము జరుపవచ్చునని అది కన్యా వివాహమే అగునని నిరూపించెను.

1916 మార్చిలో మందసాకు వచ్చి నాయన అటనుండి కలువఱాయికి చేరెను. 5-5-1916 తేది నలనామ సంవత్సర వైశాఖ శుద్ద ద్వితీయ వజ్రేశ్వరికి ఎనిమిదవ యేటనే నాయన బంధువుల పట్టుదల వలన వివాహమును గావించెను. తిరువణ్ణామలైకి బయలు దేరుచు త్రోవలో నెల్లూరు నందు రాజకీయ సభలో నాయన సంస్కృతమున అనర్గళముగా ఉపన్యసించెను. మఱునాడు అక్కడ జరిగిన సనాతన ధర్మ సభలో నాయన 'వేదశాస్త్ర సంప్రదాయములు' అను సమాసమును ద్వంద్వమునుగా గ్రహించి వేదములు, శాస్త్రములు, సంప్రదాయములు మూడును సమానముగా ప్రమాణము లైనట్లు గ్రహించుట తప్పు అని, దేశ కాలములకు అనుగుణముగా సంప్రదాయములను సంస్కరించుకొనుట వలన వైధికమైన ధర్మమునకు భంగము వాటిల్లదని ఉద్ఘాటించెను. సంప్రదాయ వాదులకు కొంతమందికి ఆ యభిప్రాయములు నచ్చలేదు.

తిరువణ్ణామలై చేరి నాయన గురు దర్శనము గావించుకొని మందసాకు తిరిగి వచ్చెను. అక్కడ మహేంద్రగిరి శిఖరమున ఒక గోకర్ణేశ్వరాలయము వున్నది. పశ్చిమతీర గోకర్ణము నందున్న దైవరాతుడు మందసాకు వచ్చి ఈ గోకర్ణమును దర్శింప కోరి