Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూజారి ఒకడు వీరి మహత్త్వమును గుర్తించి ఊరిలో ప్రచార మొనర్చెను. అప్పుడు అనంతశాస్త్రి అనునొక యుద్దండ పండితుడు గోకర్ణములోని పండితులతో వాద మొనర్చుటకు వచ్చెను. వారు నాయనను ప్రార్థించి ఆయన వాదమునకు ప్రతివాదమును గావించుటకు ఒప్పించిరి. అనంతశాస్త్రి ఈశ్వరుని మహిమయొక్క ప్రాముఖ్యమును గూర్చి చమత్కృతితో ప్రవచనము గావించెను. వాసిష్ఠుడు ఆ వాదములోని యుక్తులను ఖండించి ఈశ్వర వైష్ణవ మతములు రెండును వేదము నందు చెప్పబడిన ఇంద్ర మతమునకు శాఖలవంటివని నిరూపించి వేదోద్ధరణము యొక్క ఆవశ్యకతను ఉద్ఘాటించెను. అనంతశాస్త్రి నిరుత్తరుడై వాసిష్ఠునకు పాదాభి వందనము గావించి శిష్యుడయ్యెను.

పిమ్మట నగరమున నాగేశ్వర వీధిలో శ్రీ వెంకటరమణ పండితుని యింట నాయనకు బస కల్పింపబడెను. అచ్చట జ్యోతిశ్శాస్త్రజ్ఞులు కొందఱు పరాశర సంహిత యందు తమకు కలిగిన సందేహములను నాయనను అడుగ జొచ్చిరి. ఆ సందేహములు తొలగుటకు శాస్త్రము సులభగ్రాహ్య మగుటకును నాయన లఘు సంహిత అను పేరుతో కొన్ని సూత్రములను రచించి యిచ్చెను. జ్యోతిష ఫలములను సరిగా చెప్పుట కిది ఎంతో ఉపకరించు చున్నదని గోకర్ణ పండితులు నేటికిని చెప్పుకొను చుందురు.

ఈ జ్యోతిశాస్త్ర రచనమును గూర్చి శ్రీ నిష్ఠల సీతారామశాస్త్రి ఇట్లు ప్రశంసించినాడు. 'జ్యోతిషశాస్త్ర గ్రంథములలో ఒకే ఒక గ్రంథమున ఇన్ని విషయములు ఇంత సంగ్రహముగా ఎక్కడను