పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భూమియొక్క కార్యభారమును ఈశ్వరుడు వహించుచుండగా, జీవుడు ఆ భారమును నేనే వహింతు ననుట, గోపురమును నేను మోయుచున్నానని దాని క్రిందనున్న స్తంభములో చెక్కబడిన బొమ్మ తలంచుట వంటిదే యగును. ఈ యభిప్రాయమును మహర్షి అనేక పర్యాయములు వ్యక్తీకరించెను. హంఫ్రీసునకు మహర్షికి ఇట్టి సంవాదమే జరిగెను.

హంఫ్రీసు:- స్వామీ, నేను లోకోద్ధరణము చేయగలనా?

మహర్షి:- నిన్ను నీ వుద్ధరించుకొనుము. లోకోద్ధరణము చేసినట్లే.

హంఫ్రీసు:- లోకోద్ధరణ సంకల్పము నాకు గలదు; అట్లు సేయ జాలనా?

మహర్షి:- మంచిదే, ముందు నీకే ఉపకారము చేసికో, నీవును లోకులలో నొకడవే గదా! అంతే కాదు; నీవే లోకము; లోకమే నీవు, ఈ రెండును వేఱుగావు*[1]

మహర్షి హంఫ్రీసునకు చెప్పినట్లుగా వాసిష్ఠునకు ఏల స్పష్టముగ చెప్పలేదు? వాసిష్ఠుని యందున్న లోకోద్ధరణకాంక్ష చాల గాఢమైనది. దీనికి బీజము తల్లితండ్రుల సంకల్పమునందే యున్నది. వారు దేశము నుద్ధరింపగల పుత్రు నొసంగుమని భగవంతుని ప్రార్థించిరి. ఆ సంకల్పమునకు ఫలముగా జన్మించిన వాసిష్ఠుని యందు అట్టి సంకల్పము ప్రబలముగానుండుట సహజము. భగవంతుడొసంగిన వరమును తప్పించుట తగదు. ఆ సంకల్ప

  1. * శ్రీ రమణలీల-పుటలు 264, 265