Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ర్పించెను. "సరే నాయనా" అని స్వామి దానిని స్వీకరించి భద్రపరచుటకై పళనికి ఇచ్చెను.

అప్పటికి ఎన్నడును ఒక్క మాటైనను పలుకని స్వామి మాటాడు చుండుటను చూచి పలని ఆశ్చర్యానంద పరవశుడై పురము లోనికి పరుగెత్తి నలుమూలల "ఎవ్వరో నాయన" అను వ్యక్తితో బ్రాహ్మణస్వామి మాటాడుట కారంభించెనని కనబడినవారి కెల్ల చెప్పెను. పూర్వ దినమున రథము కదలినట్లే ఆనాడు స్వామి యొక్క వాక్కు అను రథము కదలినట్లుగా జనులు కుతూహలముతో స్వామియొద్దకు వచ్చిరి. వారికి అందఱకు స్వామి దర్శనము సులభమగుట కొఱకు పలని గుహకు ముందున్న దడిని తీసివేసెను. జనులు గుంపులై స్వామిని పరివేష్టించిరి. ఒక పండితుడు స్వామిని సమీపించి "స్వామీ ! మీ రీ దినమున ఎవరో 'నాయన' అను వ్యక్తితో మాటాడుటకై మౌనము వీడినారట. ఆ సత్పురుషు డెవడు? ఎక్కడున్నాడు? అని యడిగెను. స్వామి 'వీరే నాయన' అని వాసిష్ఠుని చూపెను. క్రిందటి దినమున రథము కదలుటకు కారణ భూతుడైన వ్యక్తి అతడే అని కొందఱు గుర్తించిరి. రెండు అద్భుతములకు కారణమైన వాసిష్ఠుని అందరు సంభ్రమముతో గౌరవముతో చూచిరి. దాక్షిణాత్యులు దేవుడైన గణపతిని 'నాయన' అని పేర్కొందురు. 'స్వామి స్వయముగా 'నాయన' అని పేర్కొన్న వాసిష్ఠుడు కూడ గణపతి యంశమున జన్మించి యుండునని వారు స్వామికి, గణపతికిని ప్రణమిల్లిరి. అప్పుడు వాసిష్ఠుడు వారి కిట్లు చెప్పెను. 'ఈ స్వామి లోక గురువుగా అవతరించిన దివ్య మూర్తి, కావున నేను ఈయనకు భగవాన్ శ్రీ రమణ మహర్షి అను నామధేయమును ఏర్పరిచితిని. మీరింక వీరిని భగవాన్ అనియే సంబో