ఆయనను కోరెను. ఆ మాటవిని విశాలక్షమ్మకూడ భర్తను ప్రోత్సహించెను. 1904 జనవరిలో ఆయన అరుణాచలం వీడి వేలూరునకు వచ్చెను. కళాశాలలో ప్రవేశించిననాడే యఫ్. ఏ. తరగతిలో (F.A. Father of Arts ఇప్పటి ఇంటర్మీడియేట్) రామస్వామికి మేనల్లుడైన అప్పుశాస్త్రిని (కె. జి. సుబ్రహ్మణ్యశాస్త్రి) తనకు ఆప్తుడైన శిష్యునిగా గుర్తించెను. అప్పుశాస్త్రి తన తమ్ముడైన కళ్యాణ రామునితో గురువును సేవించుచుండెను. ఈ సోదరులను తనకు పూర్వజన్మ సంబంధులైన కింకరులనుగా గుర్తించి కావ్యకంఠుడు వీరికి మంగళ ప్రదమగు మంత్రమును ఉపదేశించెను.
వేలూరులో కావ్యకంఠునియొద్ద ఎందరో స్త్రీలు పురుషులు మంత్రదీక్షలను గైకొనిరి. వీరిలో విద్యార్థులు అధికముగా నుండిరి. పెద్దలలో సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి పినతండ్రియైన నరసింహం ప్రముఖుడు. ఈయనయే తర్వాత సన్న్యసించి "ప్రణవానందు" డయ్యెను. ఇంటియొద్ద అధ్యాత్మిక బోధన కాక పెద్దల యభ్యర్థనమున కావ్యకంఠుడు బహిరంగసభలలో కూడ వేదమత ప్రాముఖ్యమును గూర్చి బోధించెను. ఈ ప్రసంగముల వలన హైందవమతమును పరిహసించు వ్యసనము క్రైస్తవులలో చాల వఱకు తగ్గెను. ఉపాధ్యాయులయందున్న గౌరవమునకు నిదర్శనముగా వారి మతమునకు బానిసలు కానక్కఱలేదని విద్యార్థులు గ్రహించిరి. విద్యార్థులయందు వేదమతాభిమానముతో పాటు మాతృదేశభక్తి ప్రబలజొచ్చెను. ఉత్తరదేశమున ప్రజ్వరిల్లు చున్న విప్లవోద్యమముచే చెన్నపురమున విద్యార్థులు ప్రభావితులై ఉద్రేకము నొందజొచ్చిరి. దొరస్వామి వారికి నాయకుడై వేలూరు