పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గణపతి నాసికనుండి త్ర్యంబకము మీదుగా కుశావర్తమునకు చేరి పదునాల్గు దినములు నీలాంబికాలయమునందు తపస్సు చేసెను. అచ్చట రామబాపు అనువానితో పరిచయ మేర్పడి, వాని ప్రేరణమున గణపతి మొదటి సారిగా అష్టావధాన మొనర్చెను. పిమ్మట అతనితో నాసికకు తిరిగివచ్చి గణపతి అచ్చట తపస్సునకు యోగ్యమైన స్థలమును వెదకుటకు ఒంటరిగా బయలుదేరెను. అట్లు వెదకుచు గణపతి లక్ష్మణాలయమున ప్రవేశించెను. అప్పుడది నిర్జనమై యుండెను. ద్వారము దాటినంతనే కోవెల పూజారి గణపతిని దొంగ యనుకొని జుట్టు పట్టుకొని గ్రామాధికారి యొద్దకు ఈడ్చుకొని పోజొచ్చెను. అంతకు పూర్వము పండిత గోష్టిలో గణపతిని చూచియున్న యొక వ్యక్తి ఎదురై పూజారిని మందలించి అతనిని విడిపించెను. పూజారి తన తప్పును ఒప్పుకొన లేదు. గణపతి క్రుద్ధుడై నాసిక ధ్వంస మగునట్లు శపించెను. పిదప శాంతించి అతడు ఆ పరిసరముననే 'నవచూతి' అను స్థలమున డెబ్బది దినములు ఘోర తపస్సును చేసెను. ఒక దిగంబరుడు తెల్లనివాడు కలలో కన్పించి ఆంధ్ర భాషలో ఇంటికి పొమ్మనెను. శాపము వలన పూజారి కుటుంబము మొదలుగా నాసిక నగరము మారీ జ్వరముతో తుఫానుతో ధ్వంస మయ్యెను.

గణపతి కలువఱాయికి తిరిగివచ్చి కొన్ని నెల లుండెను. విశాలాక్షి గర్భవతి యయ్యెను. గణపతి మరల బయలుదేరి భువనేశ్వర క్షేత్రమున కేగి తొమ్మిది దినములు తపస్సు చేసెను. తుది దినమున రాత్రి గణపతికి భువనేశ్వరి సాక్షాత్కరించి బంగారు గిన్నెతో తేనెను త్రావించెను. అప్పుడతడు వెన్నెలలో ఒక ఱాతిపై