పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/123

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శ్రీ అయ్యల సోమయాజుల వేంకటరమణ ఈయనను గూర్చి చెప్పిన మాటలు గమనింపదగియున్నవి. "........లౌకిక జీవనంలో ఆయనపడ్డ కష్టములకు అంతులేదు. నిత్య గంభీరుడు, శాంత స్వరూపుడు, కోమల హృదయుడు అయిన ఆ మహనీయునికి సంసారము ప్రతిబంధకముగా నుండెడిది. చేతికి ఎముక లేని ఆయన త్యాగానికి రాబడి చాలెడిది కాదు. అతను సంసారానికి అంటి ఉండెడివాడు కాదు. సంసారం అతనిని అంటి ఉండెడిది. నిరంతరము ధ్యానమగ్నుడై తనలో తానే ఎక్కువగా జీవించాడాయన. అంటీ అంటని జీవితాన్ని గడిపి, గీతలో చెప్పినట్లు సుఖదు:ఖాలను, మానావమానాలను సమానంగా భావించి, భరించి 20-3-1966 తేది ఆదివారంనాడు అకస్మాత్తుగా గుండెనొప్పితో కన్నుమూశారు."[1]

ఇప్పుడు ఈయన కుమారుడు, నాయన మనుమడు "మైత్రా వరుణ" అను పేరుతో తాతగారి "ఉమాసహస్రము" నకు వ్యాఖ్య వ్రాసి "రమణజ్యోతి" పత్రికలో ప్రకటించుచుండుట సంతోషకరము.


14. ఖడ్గపుర నివాసము

ఖడ్గపురములో నాయన నవంబరులో ఇండియన్ ఇన్ట్సిట్యూటులో బహిరంగోపన్యాస మొసగెను. అప్పుడు నేమాని సూర్యనారాయణ శిష్యుడయ్యెను. ఇతడు నాయనను కలకత్తాకు ఆహ్వానించెను. కలకత్తాలో కిద్దర్ పురమునందు ఆంధ్రులు

  1. * జయంతి సంచిక - పుట 77