పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కారని నాయన కదివఱకే యనుభవ మయ్యెను. లోక హితముకొఱ కిట్టి పరిశోదనలచే పండితులు తోడ్పడవలెనని నాయన ఎన్నాళ్ళు చెప్పినను నొక్క పండితుడైన ముందునకు రాలేదు. ఆలోచింపగా పండితు లీనాడు పామరుల కంటే నధిక ధనలంపటులై, ధన రూపమున కిట్టుబడికాని కార్యము లెంత పుణ్యప్రదము లైనను తీరుబడి లేనివారివలె వాటి నంటకుండిరి"...[1]

నాయన గావించిన ఋగ్వేద పరిశోధనా వైశిష్ట్యమును శ్రీ అప్పల సోమేశ్వర శర్మ ఇట్లు ప్రశంసించినాడు. "ఇక మూడవ రచన" "ఋగ్వేద సంహిత" వాసిష్ఠుని ప్రాణ సంహిత. దానికి ఉపోద్ఘాత భాగ్యం ఈ కృతి (ఋగ్వేద భూమిక) వున్న గ్రంథాన్ని పరిశీలిస్తే శరీరం గగుర్పాటు చెందుతుంది. ఆ వాక్పాటవం, ఆ పొందిక, ఆ యుక్తి, ఆ గాంభీర్యం, ఆ పరమ స్వాతంత్ర్యం నాయనకే చెల్లుతాయి. "న భూతో న భవిష్యతి". ఇందులోని పరమ విశేషం "వేదాలు పౌరుషేయాలు" అని ప్రతిపాదించడం. అంటే "అతీంద్రియ ద్రష్టలైన మహర్షులు రచించిన గ్రంథాలు వేదాలు" అని నొక్కి వక్కాణించడం. ఈ సందర్భములో గణపతి శాస్త్రి, వేద వాక్య విశారుదులైన శబర స్వామిని, సాయనా చార్యులను కూడా సూటిపోటి మాటలతో అధిక్షేపించి విడిచి పెట్టారు. ఈ గ్రంథము పూర్తి అయితే ఎంతటి సిద్దాంత రత్నాలు దొరికి వుండేవో; భవతు"[2]

  1. * నాయన పుట 650
  2. * జయంతి సంచిక పుటలు 15, 16