Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుండగా నతని ద్వారా ఈశ్వరుడు తన కర్తవ్యమును చేయును గాని స్వయముగా చేయడని సిద్ధాంతము. అందువల్లనే తమ మనస్సు నందట్టి సంకల్పము బుట్టించుట కీశ్వరుని నేను ప్రార్థించుచుంటిని.

ఇట్లు.

మీ జన్మాంతర సోదరుడు.

భగవన్, దహరశయా,

......నాథా! తపస్సు పరిపక్వమై, అహంకారము నశించి, సహజ స్థితియందు స్థిరమై, యింద్రియ సమూహమంతయు భగవ దాయత్తమై యుండగా సర్వము సాధింపబడినట్లు నేను తలంచు చుంటిని. నిజాత్మనిష్ఠ నాకు మూలనిష్ఠకు మార్గము జూపుగాక. తమ కరుణ సన్నిధియందే సర్వాభీష్ఠసిద్ధి పూర్ణ మొందునని నే నెఱుగుదును. అట్టి శుభ కాలమునకై ప్రతీక్షించుచుంటిని. ఈ జను డిప్పుడు దూరములో నున్నను తమ చిత్త సామీప్య మందున్న వానివలె ప్రకాశించుగాక. ప్రభో! మీ రెప్పుడు నా హృదయమందే శయనించుచున్నారు. నే నెప్పుడు మీ పాదముల యొద్దనే శయనించుచుంటిని. మీరు నాకు నియోగించు ప్రభువులు, నేను మీకు కార్యదాసుడను.

ఇట్లన్నివిధముల మీ వాడైన

వాసిష్ఠుడు.