పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


"భగవన్ విశ్వగురూ,

...సద్దర్శనము శనివారము 14-3-31 నాడు ముగింప బడెను..... నా యనువాదమునందు గుణమున్నచో నది భగవానుని యనుగ్రహమే. ఆ శనివారమునుండి నా దృష్టి విలక్షణము కాజొచ్చెను. సర్వ పదార్థమును ఏక స్వరూపముగా జూచు చుంటిని. ఈ యభ్యాసమ దృఢమై యనుభవ రూపమున నుండుటకు భగవంతుని ప్రార్థించుచుంటిని. నీటియందు బుడగ వలెనే యొక్క సద్వస్తువునం దీరూప వికారములను తిలకించు చుంటిని. ఆ వికారమును విడిచి శుద్దసద్రూపమును పొందుటకు యత్నించుచుంటిని.

ఇట్లు మీ యనుగ్రహార్థి,

వాసిష్ఠుడు.

భగవన్ కారణ గురో,

24-3-31,

...ఓ మాయాపుంజ సంహారి; ఇప్పటికిని నాకు భేదబుద్ది యస్తమించలేదు. మీయొక్క క్షణిక సంకల్పమున్నచో నాకది సర్వాత్మ భావ మగునని నే నెఱుగుదును. స్వేచ్ఛగా మీ మనస్సు నందొక్క సంకల్పమైన నుండజాలదని నే నెఱుగుదును. ఈశ్వరుడే మీ మనస్సునం దట్టి సంకల్పమును బుట్టింప సమర్థుడు. ఇట్టి ద్రావిడ ప్రాణాయామ విదమేల యని ప్రశ్న రావచ్చును. ఈశ్వరుడే స్వయముగా అనుగ్రహించక మఱొకనికి సంకల్పము బుట్టించుటకేల ప్రయాస పడవలెను? నిజమే. ఈ రహస్యము పుణ్యాత్ము లెఱుగదగినది. అవతార పురుషుడు జాగరూకుడై