పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/111

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బి.వి.నరసింహస్వామి అను న్యాయవాది చెన్నపురము నుండి నాయన చరిత్రను అడిగి వ్రాసికొనుటకు వచ్చి ముందుగా మహర్షిని దర్శించి స్వీయ చరిత్రమును చెప్పుడని కోరెను. "నాయన చెప్పిన తరువాత నేను చెప్పెదను" అని మహర్షి యనెను. ఆయన నాయన యొక్క చరిత్రమును అంశముల రూపమున నాయన చెప్పుచుండగా వ్రాసికొనెను. అట్లే మహర్షి చరిత్రమును వ్రాసికొని ఆయన వెంటనే దానిని గ్రంథమునుగా పెంపొందించెను. నాయన చరిత్రమును అట్లు పెంపొందింపక అంశముల ప్రతిని గైకొని ఆయన ఆశ్రమము నుండి బయలుదేరు చుండగా భగవాను ఆయన యొద్ద నుండి దానిని గైకొని భద్రపరచెను. మహర్షి చరిత్రము "Self Realisation" (ఆత్మ సాక్షాత్కారము) అను పేరుతో ఆంగ్లమున ఆశ్రమము వారిచే ప్రకటింప బడినను, నాయన చరిత్రము విపులీకరింపబడ లేదు. భగవాను భద్రపరచిన యంశముల ప్రతి అట్లే యుండెను. నాయన స్వర్గస్థుడైన తరువాత కపాలిశాస్త్రి నాయన చరిత్రమును సంస్కృతమున వాసిష్ఠ వైభవమ్ అను పేరుతో రచించుచు అందులో మొదటి భాగమున ఆ యంశములను ఉపయోగించుకొనెను.

13. ఆనందాశ్రమ నివాసము

1929 వేసవిలో తిరువణ్ణామలైయందు ఎండలు నాయనకు దుర్భరముగా నుండెను. అప్పుడు అక్కడికి వచ్చిన దైవరాతుని శిష్యులు వాసిష్ఠుని గోకర్ణమునకు రమ్మని ఆహ్వానించిరి. మహర్షి