పుట:Gaanaamritamu (1897).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

ఉపోద్ఘాతము.



కాలానుగుణ్యముగా వచనప్రబంధముల వ్రాయ నుద్యుక్తులై యున్నారు. వీరి సర్వకార్యములఁ జక్క చేయుచు, ఆంధ్రభాషను వృద్ధిపొందించు మార్గముల నెక్కొల్పుచు, పరమేశ్వరుండు వీరికి దీర్ఘాయు వొసంగుఁగాత ! గుణగ్రహణ పరాయణులగు సుధీవరేణ్యులారా ! తమరపరభారతీమూర్తులగుటంబట్టి యీ పుస్తుకంబున విస్తరిల్లియున్న చిలుకపలుకులవలన నెంతయు సంతరింతురు గాక. మఱియుం దమరు విబుధశిఖామణులగుటంజేసి యా భుజంగరాయ కళానిధివలన జనించిన యీగానామృతముం జదివిచూచి పరితృప్తివహించి నా యిప్పలుకులఁ గుప్పలుకుప్పలుగా నుప్పతిల్లుచున్న తప్పులన్ని యుక్షమించి కటాక్షింపవలయునని ప్రార్థించుచున్నాఁడను.

ఇట్లు భవద్విధేయుఁడు,

నందిరాజు - చలపతిరావు.