పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొంన్నూరు

63


యీయ్న తరుణమంద్దు ఈ దేశాలక్కు జమీదారీలు యేప౯చే గన్కు పూర్వ ప్రతి పత్తులు నడవలేదు. ముత్తు రాజయ్య గారి..... ప్రకారం ఖండ్రికె మొగలాయి అమానిలోను జర్గినది, మాణిక్యారావు జంగ్గంన్న రావు గారి రెండ్డొ శాననము వ్రాయించ్చి యిప్పించ్చినారు గన్కు ఆ ప్రకారంగ్గా జగ్గుతూ వచ్చినది.

తదనంత్తరం మాణిక్యారావు జంగ్గంన్న గారు శ్రీ స్వామి వారి అనుగ్రహ చాతను చాలా ప్రబలుడై ప్రభుత్వం చేస్తూ వచ్చినాడు గన్కు ఈ భావనారాయణస్వామి వారు త్మకు జర్గంగ్గా భూమి యిచ్చి అక్కె శేవ్యం..... దేవాలయాన్ని ప్రాకారములు వగయిరాలు కట్టించ్చె శా ౧౩౧౪ (1772 AD) అగునేటి వంద్దన సంవత్సర మంద్దు స్వామి వార్కి నిత్య నై వేద్య దీపారాధన నిత్యోత్సవ వాసరోత్సవ పక్షోత్సవ మాసోత్సవముల్కు జర్గు గలంద్లుకు పోంన్నూరు........డ సైవేంద్దు మూ.... గ్గాన........కు ౬౪ కుంట్టల ప్రాప్తిని కు ౧౨౺౦ భూమి ఖండ్రికె సర్వ.... స్న౯ యత్రకరం స్వజు దానధారా పూర్వకముగా అప౯ణ చేసి ..........సంవ్వత్సరం ధ్వజారోహణ.... ది కన్యాణ మహేత............రు చూ మహోత్సవ నవరాత్రోత్సవ జయంత్తా...వములు............... గలంద్లులకు పొంన్నూరు సముతు గ్రామాదులు ఆయివేజులును వో ౨౨ వరహాలు నిన్న౯యంచేశి ఈ ప్రకారం చాలా దినములు జర్గించినారు గన్కు వారి తరుణమంద్దు ఆయ్న కుమారుడు రాజా భావంన్నా మాణీక్యరాయనింగారు బహుసౌమ్యులు గన్కు తమ తండ్రిగారు చేశ్ని వుత్సవాదులు వారితో కాకుండ్డా జర్గిస్తూ వచ్చినారు. రక్తాక్షి సంవత్సరమంద్దు మాణిక్యారావు గార్కి యిష్ట దైవమైన ఫాలురు......ములకూ దై వీరి వల్ల రాజా వాశిరెడ్డి వెంక్కటు ద్రినాయుడు గారు వచ్చిన తర్వాత వ్రాశి యిచ్చి వుంన్నారు గన్కు వారి అధీనమై వుంన్నది.

స్వామి వారి ఆలయంలో వుండే దేవతలు :-

౧ గభ౯గుడియంద్దు భావనారాయణస్వామి వారు వూ ౧
౨ వార్కి ముఖ మంట్టపంలో వుత్తరపు వయిపు.......నాయకులు ............వుండ్డగా క్రింద్దటి సంవత్సరం వెంక్కటాద్రి
నాయుడు గారు తమకి వారు........
౩ భావనారాయణస్వామి వారికి ఆలయం వెలుపల నైరుతీ భాగమంద్దు.....దేవాలయం వున్నది.
౪ స్వామి వారి ఆలయంలోని ద్వారాన్కు ఆగ్నేయ భాగమంద్ధు గూని గోవింద్దు భార్యాయుక్తంగ్గా పుంన్న విగ్రహం వుంన్నది.