పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

గ్రామ కైఫియ్యత్తులు


౦ ౦ శ్రీ మన్మహామండ్డలేశ్వర పరిచేతబేతురాజుగారు కంక్కయలు పాటిపొలమునంద్దు శ్రీ భావనారాయణస్వామి యిచ్నిది.
—————————
౧ ౫ ౺ ౦ క్షేత్రము.

సదరహి పరంగ్గా జర్గుతూ వుండె గన్కుంన్నూ తదనంత్తరం శా౧౩౧౫ (1393 AD). శకమంద్దు.................పల్లి భావనతముడై నలుంగ్గురి కమ్మము ...... హూజాపు చేతను కాలా దితమూల్యము బెట్టి వివిచి కాన యిచ్చిన క్షేత్రం:-

పొంన్నూరులో వుత్తర భాగానను పొలములో నఖములు యిచ్చిరి. ౮౧౦౺౦ చెరువులన్ను నను........వైరశి ౧౧౦.............తశవైన

హక్కు వెట్టికొని స్వామి వార్కి యిచ్చిన వాతాయమా.

తదనంత్తరం కూ...... గారు శాలివాహనం ౧౩౩౮ (1416 AD) శకమంద్దు తుంగ్గభద్ర స్వా.......హముగా బౌతవ దక్షిణానను నిత..... ..తాచి వూ వృక్షాలు సమప్పి౯ంచ్చి స్వామి వార్కి అను......యిచ్చినాడు.

తదనంత్తరం ప్రతాపరుద్ర దేవమహారాయులు విజయనగరమంద్దు రత్న సింహాసనాశీనుడై పృధివీరాజ్యం చేశే దినములలో ఆత్రేయ గోత్రీకులైన ఘ వంట్టింన్ని సోమ వంశాధ్యక్షలయ్య ఘవంట్టింన్ని శ్రీ మన్మహా మండలేశ్వర కుంద్దన రామరాజు గారి పౌత్రులుంన్ను మునిరాజు గార్కి పుత్రులుంన్ను అయినఘవంట్టి రామరాజయ్య దేవ మహారాజులుంగారు యీ చోటు యావత్తు ప్రభుత్వం చేశే యడల యీ స్వామి వార్కి స్కలోత్సవములు జపాలుంన్ను తమరు వేయించ్చే లాగును .....యకు లైన స్వామి వార్కి తోట యావత్తు సమపి౯ంచ్చి యిచ్చి శాలివాహనం ౧౪౩२ (1515 AD) శకం మొదలుకొని బహుదినములు హజారి చేశి వీరి తరుణమంద్దు దేశములు యావత్తూ మ్లేచ్చాక్రాంతములై నంద్ను యీ దేశము యావత్తు గుంట్టపల్లి ముత్తురాజయ్య..చేశే దినములలో వారి అనుమతి చాతను తిప్పరాజయ్య గారు శా ౧౫౩౫ (1613 AD) శకమంద్దు గోష్ఠి వననాధుడైన పారనూరిపాటి భావనారాయణ దేవరకు.......యీ భట్టరు వెంక్కటయ్య వెంక్కయ్య పెద్దింటి కోనయ్య నడిముట్టి జనాధ౯నుడు కృష్ణయ్య రంగ్గయ్య గారు మొదలయ్ని స్తానీకుల్కు యీ గ్రామంలోనే పది కుచ్చెళ్ళ ఖండ్రికె మాన్యముగా యిచ్చి వారి వంశాన నున్న వార్కి వ్రాయించ్చి యిచ్చి జర్పించ్చినారు.