పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

గ్రామ కైఫియత్తులు


సిద్దిన్ని అయ్నిది. తిరిగి స్వదేశాన్కు వచ్చిరి. అంత్తట కొంన్ని దినాల్కు స్వన్న౯ వల్లభరాయర్కి కుమాతె౯ పుట్టి గన్కు దినదిన ప్రవధ౯మాన అయినంద్ను కుమాత్తె౯కు వివాహం చయ్యవలెనని విచారించ్చె వర్కు గూని గోవింద్దు వెళ్ళి కాశీ తీర మంద్దు సర్వ దేవతా సాక్షిగా మాకు చింన్నదాన్ని యిప్పిస్తావని ప్రమాణం చేశి యిపుడు పరస్పరేణా విచారించ్చి నాకు యివ్వక వుండడం యెటవంట్టిది అని అడిగినంద్ను స్వన్న౯ వల్లభరాయని భార్య కాముకా నీకు చింన్నదాంన్ని యిస్తానని కరారు చేసినానా. చేయలేదని గూను మిట్ట మెసలు మిడిగుడ్లు దొప్పచెవులు దోని కడ్పు యిటువంట్టి లక్షణములు గలవాన్కి దివ్యలక్షణ లక్షితు రాలయ్ని నా కుమాతై౯ను యిస్తానా, యివ్వననెను. అంత్తట గోవింద్దు మామను దూరి యిది ధర్మమేనా, గంగ్గాతీరమున చేశిన బాస తప్పుతావా అని అంట్టే అందుకు వల్లభరాయుడు నీతో నేను యెవర్ని సాక్షి బెట్టినానో వారు వచ్చి చెప్పితే యిస్తానని నిరాదరణ చేశినాడు గన్కు అంత్తట మహాఖిన్నుడై గోవింద్దు కాశీకి పోయి.....విశ్వేశ్వర లింగ్డంను, దేవులను గురించ్చి అన్కే విధాలను స్తోత్రం చేశినందున శ్రీ........ప్రసన్నుడై నీ కోర్కె యేమని అడిగినంద్ను తన శ్తితి యావత్తు చెప్పి......క్షి జగత్సాక్షి......మ్మె వారిచే ప్రమాణం చేయించ్చినాను..... వేంచ్చేశి వల్లభరాయున్కి సాక్షి చెప్పి అతని కొమార్తె౯ను నాకు వివాహం చేయించ్చమని అంన్నాడు గన్కు అదే ప్రకారంగా చేయడాన్కు.......

శ్లొ౹౹ ఆనామ తరు యూ పస్వ తుంగ్గ భద్రాసవితటే ౹
ఏతత్రైలోక్యనాధ స్వభావ స్వ గరుడాంచ్చితం ౹
భావనారాయణం దైవ భవ బ్రాహ్మణ సాక్షిణాం।
గోష్టీ వనేముని వద్రేః శేవ్యమానము పాష్మ హే

శ్లొ౹౹ ఆ రామ తరుకూపస్థం
తుంగభద్రా సరిత్తటే ౹
ఏతత్రైలోక్య నాధస్య
స్వభావ గరుడాంచితం ॥

శ్లొ౹౹భావనారాయణం దైవం
భవ బ్రాహ్మణ సాక్షిణం
గోష్ఠి వనే ముని వరైః
సేవ్యమానము పాస్మహేః

తా॥ తుంగభద్రా నది యొక్క యొడ్డున - వృక్షములు, సరోవరములతో గూడిన ఆ రామమంద్నుట్టి త్రిలోకనాధుని స్వభావ చిహ్నమైనట్టి భావనారాయణ దైవమును మహర్షులతో సేవింపబడుచున్న వానినిగా నుపాసించెదను.