పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57

కయిఫియ్యతు పొంన్నూరు తాలూకే రేపల్లె

పూర్వ కల్పాంత్యమందు యీ భూమి జలాన్న౯వంగ్గా వున్నందున శ్రీ మన్నారాయణుడు వటపత్ర శాయిగా శయనించ్చి ఆ సమయమంద్దు జగత్ సృష్టి నిమిత్తమై నాల్గు ముఖముల బ్రంహ్మదేవుని తన నాభికమలమంద్దు పుట్టించ్చినంద్ను ఆ బ్రంహ్మదేవుడు ప్రపంచ్చం గానక తన జనన కరణ హేతువును గురించ్చి తపస్సు చేశినంద్ను తపరితపః అనే వాక్యం వినిపించినంద్ను ఆంత్తట తపస్సు చేశే నిమిత్తమై యీ జలమధ్యమందు స్థల నిదే౯శం- విచారించ్చగా కొంచ్చం గుట్ట అగుపడినంద్ను అక్కడ నిల్చి యేకాగ్రచిత్తముతో తపస్సు చేశినంద్ను పరాపరవస్తులైన నారాయణుడు ప్రసంన్నుడై జగత్సృష్టి చేయుమని ఆనతిచ్చి నంద్ను అదే ప్రకారం జగత్తు నిమా౯ణం చేశెను అనింన్ని త్రేతాయుగమంద్దు బ్రంహ్మదేవుడు యిక్కడ యజ్ఞం చేశినంద్ను యిక్కడికి వేంచ్చేశినారు. అప్పుడు బ్రంహ్మతోటి వేదాంత్త గోష్టి జరిపినంద్ను గోష్తి వనమయ్నిది.

తదనంత్తరం ద్వాపర యుగమంద్దు సత్యవ్రతుడనే రాజు యీ స్తలమంద్దు మహానిష్ట చాత తపస్సు చేశినంద్ను ప్రసంన్నుడైనాడు గన్కు బ్రంహ్మ సృష్టి మొదలుకొని యీ దివ్య దేశము వుంన్నది. అని స్తలమహాత్యమంద్దు విస్తరించ్చి చెప్పబడి వుంన్నది.

కలియుగ సంప్రాప్తమైన తర్వాతను స్వన్న౯ కాపురస్తుడైన బ్రాంహ్మడు వల్లభరాయుడు అనే అతను సంతానం లేనంద్ను బహుదినములు విచారక్రాంతుడై సంతానం లేని జీవనం వ్యధ౯మని విచారించి భార్యాసమేతుడై గంగ్గా యాత్రకు వెళ్లెను. యితన్కి మేనల్లుడు గోవింద్ధు గూనివాడుంన్ను గుజ్జు రూపుండుంను యిత్యాది లక్షణముల ప్రపంచ మానవ రూపానకు విరూపంగ్గా వుండేవాడు. గన్కు ప్రపంచ జనులు యితన్కి యవ్వరూ చింన్నదాన్ని యివ్వనంద్ను వివాహం ల్కే బ్రంహ్మచారిగా పొంన్నూరికి రెండు కోసులు వుంన్న నిడిమోలులో వుండ్డేవాడు అతను త్న మేనమామ గారైన స్వప్న౯ వల్లభరాయని సంగ్గతి విని తాను కూడా యిల్లు బయలుదేరి మాగ్గ౯ంలో అత్తమామలను కల్సుకొని కాశ్కి పోయి గంగ్గయందు స్నానం చేశి విశ్వేశ్వరబింద్దు మాధవాది దేవతలను శేవించ్చి......... వల్లభరాయుడు భార్యాసహితం పుత్ర కాంక్షియై తపస్సు చేశే యడల వీని మేనల్లుడు గూని గోవింద్దు విష్ణుభక్తుడుంన్ను సత్యవాక్యుడుంన్ను తపః ప్రభాన సంపన్నుడు గన్కు ఎవ్వత విచారించ్చి మీకు సంతానం కల్గునప్పుడు కుమాతై౯ పుడితే నాకు యిచ్చి వివాహం చేస్తారా అని అడిగినంతనే వధూవరులు త్మకు సంతానం కల్గదనే మాట చాతను మంచిదనిరి గన్కు ఘట్టిగా ఆ కాశీపట్టణమందు గంగ్గా తీరమున వుండ్డే దేవతలు రుషులు వృక్షముల్ను సాక్షిబెట్టి త్న చింన్నదాన్ని యిచ్చేటట్టు ప్రమాణం చేయించ్చుకున్నాడు అంత్తట వార్కి తపోఫల .