పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41

దండమూడి

కయిఫియ్యతు మవుంజే దండ్డమూడి సంతు నాదేండ్ల తాలూకే సత్తెనపల్లి

సర్కారు మృతు౯ జాంన్నగరు యిలాకే రాజా మానూరి వెంకట రమణయ్య

రావు మజుందారు —

యీ గ్రామాన్కు పూర్వం నుంచ్చి దండ్డమూడి అనే పేరు వుంన్నది.

గజపతి శింహ్వాససస్థుడయ్ని గణపతి మహారాజులుంగారు ప్రభుత్వం చేశేటప్పుడు వీరి దగ్గిర మహాప్రధానులయ్ని గోపరాజు రామంన్న గారు శాలివాహనం ౧౦౬२ శక (1145 AD) మందు ప్రభువు దగ్గర దానంబట్టి సమస్తమయ్ని నియ్యోగులకు గ్రామ కరిణీకవు మిరాశీలు నిన౯ యించ్చే యడల యీ గ్రామాన్కు నందవరీకులు రుక్ శాఖాధ్యయనులున్ను శ్రీవత్సస గోత్రులుంన్ను అయ్ని ఆధానంతిమ్మరాజు అనే అతనికి ఏకబోగంగ్గా మిరాశి నిర్ణయించ్చినారు గన్కు తదాది మొదలుకొని యే తద్వంశజు లైనవారు గొట్టిపాటి వారు అనే అభిదానం చాత అనుభవిస్తూ వుంన్నారు.

వడ్డెరెడ్డి కర్నాటక ప్రభుత్వములు శాలివాహానం ౧౫౦౦ శకం (1578 AD) వర్కు జర్గిన తర్వాతను మొగలాయి ప్రభుత్వం వచ్చెను గన్కు కొండ్డవీటి శీమ సంత్తు బంద్దీలు చేశేటప్పుడు యీ గ్రామం నాదేండ్ల సంతులో దాఖల్ చేశి సముతు అమీలు దేశస్తుల పరంగా బహుదినములు అమాని మామిలియ్యతు జరిగించ్చినారు.

కొండ్డవీటి శీమ మూడు వంట్లు చేశి జమీదాల౯కు పంచిపెట్టేయడల యీ గ్రామం సర్కారు మపుంద్ధాకులయ్ని మానూరి వెంక్కన్న పంత్తులు వంట్టులో వచ్చి చిల్కలూరిపేట తాలూకాలో దాఖలు అయ్నిది. వెంక్కన్న పంత్తులు అప్పాజీ పంత్తులు వెంకట్రాయనిం గ్గారు, వెంక్కట కృష్ణునింగారు ప్రభుత్వం చేశ్ని తర్వాతను వెంక్కట కృష్ణునింగారి కొమారు లయ్ని రాజా నరసంన్నారావు గారు ప్రభుత్వం చేస్తూ వుండగా పయ్ని వాన్ని ఆప్పాజీ పంత్తులు గారి కొమారులయ్ని వెంక్కటేశ్వర రావు గారు తాలూఖా సఖం పంచుకునే యడల యీ గ్రామం వెంకటేశం రావు గారి వంత్తువచ్చి సత్తెనపల్లి తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు వెంకటేశం రావు గారు స్న ౧౨౦౫ ఫసలీ ౦౨౦౫ (1794 AD) వర్కు అధికారం చేశ్ని తర్వాతను తత్పుతృలయ్ని వెంక్కట రమణయ్య రావు అధికారం వహించ్చి యిది వర్కు ప్రభుత్వం చేస్తూ వున్నారు,

మవుజే మజ్కూరిలో నూరు సంవత్సరములకు పూర్వం మొగలాయి ఆమానీలో మజ్కూరి కాపు అయ్ని దేవినేని బసవన అనే అతను రాజలింగేశ్వర స్వామి వారనే శివస్తలం