పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

గ్రామ కైఫియత్తులు


యీ ప్రకారంగా నిన్న౯యించ్చినారు.

స్న ౧౧౨౨ (1712 AD) ఫసలీలో కొండ్డవీటి శీమ జమీదాల్ల౯కు మూడు వంట్లు చేశి పంచ్చి పెట్టే యడల యీ గ్రామం సర్కారు మజ్ముందాల్లు౯ అయ్ని మానూరి వెంక్కన్న పంత్తులు గారి వంట్టులో చేరి చిల్కలూరి పాటి తాలూకాలో దాఖలు అయినంద్ను వెంక్కన్న పంత్తులు అప్పాజీ పంత్తులు వెంకట్రాయనింగారు వెంక్కట కృష్ణునింగారు ప్రభుత్వము చెశ్ని తర్వాతను వెంక్కట కృష్ణునింగ్గారి కొమారులయ్ని నర్సంన్నారావు స్న ౧౧२౯ (1766 AD) ఫసలీలో ప్రభుత్వాన్కు వచ్చి స్న౧౧౮౧ (1771 AD) ఫసలీ వర్కు ప్రభుత్వము చెశ్ని తర్వాతను ఆపయ్ని వ్రాశ్ని అప్పాజీ పంత్తులు గారి కొమారులయ్ని వెంక్కటేశం రావు గారు. స్న ౧౧౮౨ (1771 AD) ఫసలీలో తాలూకా సఖం పంచుకుంన్నారు గన్కు యీ గ్రామం సత్తెనపల్లి తాలూకాలో దాఖలు అయ్నింద్ను వెంక్కటేశం గారు సదరహీ ఫసలీ లగాయతు ప్రభుత్వం చేస్తు వుంన్నారు.

.౧ గుంట్టె సూర్యనారాయణ సోమయాజులు
౦ ౺ ౦ తాడేపల్లి అనంత రామంన్న గార్కి
౧ కాలిచ్ని పాపంన్న సోమయాజులు గార్క్
౩ శ్రీరంగ్గగ పురపు గుడి మళ్ళ నరసింహ్వచార్యులుగార్కి
౦ ౻ ౦ పయ్ని వాళ్ని భట్టు మాధవుని మనుమడయ్ని బుచ్చయ్యకు
————————
౬ ౹ ౦

యినాము యిప్పించి ౧౨౦౫ (1795 AD) ఫసలీ వర్కు ౨౪ సంవత్సరములు ప్రభుత్వం చేశెను.

తదనంత్తరం వీరి కొమారులయ్ని వెంక్కటరమణయ్య గారు ప్రభుత్వానకు వచ్చి

౧ పంన్నల మల్లగురు ..
౦ ౺ ౦ కళాశ్వల పాటి లక్ష్మయ్యకు
——————
౧ ౺ ౦

యినాములు యిప్పించి సదరహి దేవ బాహ్మణ స్వాస్యములు పూర్వము నుంచ్చి కరిణీకులకు నాల్గు సంప్రతులకులన్నూ వుండుకుంన్న మాన్యాలు కు ౫ కుచ్చళ్లు నడిపిస్తూ స్న ౧౨౨౧ (1811 AD) ఫసలీ వర్కు ప్రభుత్వము చేస్తూ వుంన్నారు.