పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండ్డ పాటూరు

21


తరువాతను పయ్ని వ్రాశ్ని వెంకట నర్సారాయినింగారి కొమారులయ్ని వెంక్కట గుండ్డా రాయినింగారు ప్రభుత్వం చేస్తూ వున్నారు.

శాలీవాహనం ౧౬౭౪ (1752 AD) అగునేట్కి ఆంగ్గీరస నామ సంవత్సర వైశాఖ శు ౧౦ ల రోజ్ను మజ్కూరి మిరాశిదారులయ్ని గంఢవాహిని ప్రతి నామధేయమైయ్ని కొండ్డపాటూరి శీతారాముడు భద్దిర్రాజు మొదలయ్ని వారు గ్రామాన్కు వుత్తరభాగమంద్దు శివాలయం కట్టించి మల్లేశ్వర స్వామి అనే లింగమూత్తి౯ని ప్రతిష్ఠ చేశి పయ్ని ప్రశ్ని శంక్కర మంచివారినే అచ౯కత్వానికి నియామకం చేశినారు. గన్కు ఆ దినములలో ప్రభుత్వము చేస్తూవుంన్న రాజామల్రాజు వెంక్కట నర్సారాయునింగారు యీ స్వామి వారికి నిత్య నైవేద్య దీపారాధనలకు జరుగగలంద్లుకు కు ౧ పొలం యినాము యిప్పించినారు. తదనంత్తరం శంకర మంచ్చివారు రెండ్డు శివ స్థళాలలో అర్చకము చేయడమున్కు స్వకీయ్యులు లేనంద్ను నండ్డూరి గురులింగం అనే శివద్వజుని తీసుకువచ్చినాడు గన్కు సలజ్ఞులు విచారించి గురులింగాని పూర్వీకులయిక మల్లేశ్వర స్వామి వారిన్ని అర్చన శాయ డాన్కు నియమించి పూర్వీకులయిన శంకరమంచ్చివారిని పునహప్రతిష్ఠ చేశ్ని మల్లేశ్వర స్వామి వార్ని పూజించడాన్కు నిన౯యించినారు గనుక పయ్ని ప్రశ్ని ప్రకారంగ్గా వుభయులు అచ౯న చేస్తూ వుంన్నారు శ్రీ చంన్న కేశ్వరస్వామి వారి ఆలయం శాలివాహనం ౧౬౦౮ (1686 AD) అగునేటి అక్షయ సంవత్సరములో దేశాన్కు మహత్తు అయ్ని క్షామము సంభవించ్చినది. గన్కు అప్పట్లో స్వామివార్కి నిత్యనైవేద్యాలు జరుగకుండ్డా వుండ్డె గన్కు శాలివాహనం ౧౭౧౬ (1794 AD) అగునేటి ఆనంద్ద నామ సంవత్సర చైత్ర శు॥ ౧౫ల రోజ్ను గ్రామస్తులు శ్రీ స్వామి వారికి ఆలయంకు రావడం చేయించ్చి పునః ప్రతిష్ఠ చేశి మాస్వామి వారిని పూజించ్చడాన్కు నారాయ ఆరుణం రమణాచార్యులు పెదింట్టి నరశింహ్వా చార్యులు అనే విఘనుసులను నిన౯యించ్చినారు గన్కు యీ స్వామి వార్కి నిత్య నైవేద్య దీపారాధనలు జరుగగలంద్లుకు దేశ ప్రభువులయ్ని రాజా మల్రాజు వెంక్కట గుండ్డారాయినిం గారు కు ౧ పొలం యినాము యిప్పించినారు.

రిమాకు౯ గ్రామ గుడికట్టు కుచ్చళ్లు ౧౪౦ కిమ్నిహాలు
౨ ౺ ౦ గ్రామ కంఠం భాస్కరయ పాలెం బయటి వాండ్ల పాద్రున పొలం.
౧ ౺ ౦ క॥ మజ్కూరు.
౦ ౹ ౦ భాస్కరయపాలెం
౦ ౻ ౦ బయటి వాండ్ల పాలెం.
౪ ౺ ౦ చరువులు మిట్టలు 0 కి.
౨ ౦ ఽ చరువులు 3 కి
౧ ౹ ౦ వూర చరువు కాల్విడ మొత్తం